మహబూబ్‌నగర్

తాగునీటి ఎద్దడి నివారించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, మే 19: గ్రామాలలో తాగునీటి ఎద్దడి లేకుండా మిషన్ భగిరథ ద్వారా బల్క్ సరఫరాకు స్థానికంగా ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ శే్వతామహంతి ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ చాంబర్‌లో జిల్లాలో తాగునీటి సరఫరా, మిషన్ భగిరథ పనులను సంబందిత ఇంజనిరింగ్ అధికారులతో సమీక్షించారు.మండలాలోని ఆయా గ్రామాల వారిగా తాగునీటి సరఫరాను సమీక్షించిన కలెక్టర్ ప్రస్తుతం తాగునీరు ఎక్కడి సరఫరాచేస్తున్నారు ఆ గ్రామాలకు మిషన్ భగిరథ ద్వారా బల్క్ సరఫరా అవుతున్నాదా లేదా పూర్తి నీటిగా నీటి వనరులు లేని గ్రామాలు తదితర విషయాలపై క్షున్నంగా సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వారం రోజుల్లో మిషన్ భగిరథ కింద బల్క్ సరఫరాకు స్థానికంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాల్సి వస్తే ముందే తమ దృష్టికి తీసుకురావాలని , అంతేకాక త్రిసభ్య కమిటి ఆమోదంతోనే తాగునీటి సరఫారకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్‌డబ్ల్యూ ఎస్ అసిస్టెంట్ ఇంజనీర్లు ప్రతి సోమవారం ఎంపిడివో కార్యాలయంలో హజరు కావాలని ప్రతి శనివారం తన కార్యాలయంలో జరిగే సమీక్షకు హజరు కావాలన్నారు. ఎక్కడైనా తాగునీటికి తీవ్ర సమస్యలు ఉన్నట్లు దృష్టికి వస్తే ఎస్ ఇ, ఇ ఇలు ప్రత్యక్షంగా వెళ్ళి పరిశీలించాలన్నారు. పాత ఓహెచ్ ఎస్ ఆర్ లకు మిషన్ భగిరథ కనెక్షన్లను పరిశిలించాలని వచ్చే శనివారం నాటికి 60 శాతం గ్రామాలో మిషన్ భగిరథ బల్క్ వాటర్ సప్లయి చేసేందుకు ఏన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
అచ్చంపేట, మే 19: మండల పరిధిలోని ఎద్దు మిట్టతాండకు చెందిన రైతు సభావట్ తుల్చ (55) శుక్రవారం రాత్రి ఎవ్వరులేని సమయంలో ఇంట్లో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడాడు. తుల్చకు భార్య దేవి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. తుల్చ కుటుంబాన్ని మాజీ ఎంపీపీ మద్దెల రామనాథం పరామర్శించారు. ఆత్మహత్యకు కుటుంబ కలహలే కారణమని బందువులు తెలిపారు.

పుకార్లు నమ్మొద్దు
- ఎస్పీ అనురాధ పిలుపు
మహబూబ్‌నగర్‌టౌన్, మే 19: చిన్నారులను ఎత్తుకుపోయే ముఠాలు, నేరగాళ్లు, దొంగలు గుంపులుగా తిరుగుతున్నారని వస్తున్న పుకార్లను ఎవ్వరు నమ్మవద్దని జిల్లా ఎస్పీ అనురాధ అన్నారు. శనివారం సామాజిక మద్యామాల్లో వస్తున్న పుకార్లపై జిల్లా ఎస్పీ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని బయటకు కనిపించే విధులు కాకుండా ఆయా గ్రామాలు, పట్టణాల్లో అనుమానిత ప్రదేశాలలో, వ్యక్తులపై కూడా పోలీసుల ప్రత్యేక నిఘా ఉంటుందని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఇంతవరకు జిల్లాలో, ఇతర జిల్లాల్లో ఇలాంటి ముఠాల గురించి ఎలాంటి సమాచారం లేదని ప్రజలు కూడా అనవసర భయాందోళనకు గురికావడం చూడని విషయాలను ప్రచారం చేయడం సరైంది కాదని హితవు పలికారు. ముఖ్యంగా ఎవరైన అనుమానిత వ్యక్తులు కనిపించినట్లు అయితే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని లేదా సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని అంతేకానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. వద్దంతులు సృష్టించేవారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని తప్పుడు వార్తలు సృష్టించి సామాజిక మాద్యామాల్లో ప్రచారం చేసేవారిపై క్రిమినల్ చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.