మహబూబ్‌నగర్

హైకోర్టు ఆదేశాల మేరకు మానసిక వికలాంగులను గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 19: హైకోర్టు ఆదేశాల మేరకు వికలాంగులను గుర్తించడానికి జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో జిల్లాలోని ఆశ, అంగన్‌వాడీ వర్కర్లు తమ ప్రాంతాల్లోని కుటుంబ ఆదారణలేని మానసిక వికలాంగులను గుర్తించి అట్టి వారి వివరాలను తెలియజేయాల్సిందిగా సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ సూచించారు. శనివారం కలెక్టరేట్ చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ హైకోర్టు అదేశాల మేరకు, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గ్రామ,మండల,జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామస్థాయి కమిటీకి సర్పంచు, ఎమ్మెల్యే నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కమిటీకి ఐసిడి ఎస్ సూపర్‌వైజర్ కన్వినర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ కమిటీలు నెలకొకసారి సమావేశమై గ్రామంలో సర్వే చేసి ఎటువంటి నేరాల్లో లేని, కుటుంబ ఆదరణ, వేదింపులకు గురవుతున్న మానసిక వికలాంగులను గుర్తించి మండల స్థాయి కమిటీకి తెలియజేస్తారన్నారు. మండలస్థాయి కమిటీలో ఎంపీడీ ఓ చైర్మన్‌గా, సిడిపి ఓ కన్వినర్‌గా వ్యవహరిస్తారని ఈ కమిటీ మూడునెలలకోసారి మండల స్థాయిలో మానసిక వికలాంగులను గుర్తించి వారి కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి మానసిక వికలాంగులను వేదించేవారిపై అవసరమైన కేసులు బుక్ చేయడం వికలాంగులను ఎన్‌జి ఓల ద్వారా నడుపుతున్న ప్రత్యేక పాఠశాలలో, ప్రభుత్వ శాఖల్లో నిర్వహించబడుతున్న హోంలలో చేర్పించాలని ఆ వివరాలను జిల్లా శాఖకు అందిస్తారని అన్నారు. జిల్లాస్థాయి కమిటీ మండల స్థాయిలో చేపట్టిన చర్యలపై సమీక్షిస్తుందని అన్నారు. ఆరునెలలకోసారి సమావేశం జరుగుతుందని అన్నారు.

వాణిజ్య పంటలతో లాభాలు గడించండి
రైతులకు మంత్రి జూపల్లి సూచన
కొల్లాపూర్, మే 19: ఆధునిక పద్దతిలో రైతులు వాణిజ్య పంటలు పండించి లాభాలు గడించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం నియోజక వర్గంలోని అంకిరావుపల్లి, చుక్కాయపల్లి, కుడికిళ్ల, చౌటబట్ల, రామాపురం, పెంట్లవెల్లి తదితర గ్రామాలలో రైతుబంధు పథకం కింద పట్టపుస్తకాలు, చెక్కులను మంత్రి జూపల్లి కృష్ణారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో మాట్లాడుతూ ఎంజీ ఎల్ ఐ ఎత్తిపోతల పథకం ద్వారా నియోజక వర్గంలోని దాదాపు అన్ని గ్రామాలకు సాగు నీరు అందుతుందని మండలంలో అత్యధికంగా సాగు నీరు అందుతుందని ఈ పరిస్థితులలో గతంలో మాదిరిగా వేరుశనగ, వరి అనే రకాలు కాకుండా కోనసీమ మాదిరిగా తమకున్నంత భూమిలో వాణిజ్య పంటలు వేసి అత్యధిక లాభాలు గడించాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఎన్నో అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు టీ ఆర్ ఎస్ ప్రభుత్వం చేపట్టిందని బంగారు తెలంగాణ కోసం పథకాలన్ని ఉపయోగపడుతాయాని అన్నారు. రైతులు ఎప్పటికప్పుడు మారుతున్న వ్యవసాయ పద్ధతులను ఆకాలింపు చేసుకొని సాంకేతిక విప్లవంతో పనిచేయాలని కోరారు.