మహబూబ్‌నగర్

విద్యుత్‌షాక్‌తో ఉపాధి కూలీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్వ, మే 21: మండల పరిధిలోని పాతర్‌చెడ్ గ్రామంలో విద్యుత్‌షాక్‌తో మాధవి (30)అనే ఉపాధి కూలీ సోమవారం మృతి చెందింది. గ్రామస్ధుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గత మూడు రోజుల నుండి గ్రామ సమీపంలో విద్యుత్ స్తంభం కూలిపోయి వైర్లు కిందకు వేలాడు తున్నాయ. ఈ విషయం ట్రాన్స్‌కో లైన్‌మెన్ కిరణ్‌కు పలుసార్లు విన్నవించినా పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు. రోజులానే సోమవారం ఉపాధి కూలీలు వ్యవసాయ పొలాల్లో పనులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, మాధవి తల విద్యుత్ వైర్లకు తాకడంతో అక్కడే విద్యుత్‌షాక్‌కు మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు మాధవి మృతదేహంతో నర్వ మండల విద్యుత్ సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. దాదాపు మృతదేహంతో గంటపాటు ఆందోళన చేసిన ట్రాన్స్‌కో అధికారులు స్పందించలేదు. అనంతరం తహశీల్దార్ జయసుధ, నర్వ ఎస్‌ఐ రాజేందర్ అక్కడికి చేరుకుని గ్రామస్థులను శాంతింపజేశారు. ట్రాన్స్‌కో నుండి రూ.5లక్షల ఇన్సురెన్స్‌తోపాటు ఉపాధి పథకం కిందరూ.50వేల ఆర్థిక సహయం అందేవిధంగా చూస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కాగా, గ్రామంలో 11 కేవీ విద్యుత్ వైర్లు తెగిపోయి స్తంభం కూలీపోయిన విషయం విద్యుత్‌శాఖ అధికారులకు పలుసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని, వారి నిర్లక్ష్యంతోనే నిండుప్రాణం బలికావడం జరిగిందని గ్రామస్థులు అధికారులపై మండిపడ్డారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.