మహబూబ్‌నగర్

నెట్టెంపాడు పెండింగ్ పనులను పూర్తి చేయని ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, మే 22: నడిగడ్డ ప్రాంత ప్రజల, రైతుల ఆకాంక్షలను నెరవేర్చి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసి 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో ముందుకు వచ్చి 90 శాతం పనులు పూర్తి చేసిందని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ తెలిపారు. కాగా మిగిలిన 10 శాతం పెండింగ్ పనులను పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. మంగళవారం గద్వాల మండల పరిధిలోని సంగాల గ్రామంలో ఏసీడీపీ నిధుల ద్వారా నిర్మించిన కమ్యూనిటీ భవన ప్రారంభోత్సవం గోనుపాడులో రాజ్యాంగ నిర్మాణ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా నెట్టెంపాడు కాలువల ద్వారా రిజర్వాయర్లు, చెరువులు నింపుకొని ఈ ప్రాంత రైతులు వ్యవసాయం చేసుకుంటూ సుఖసంతోషాలతో ఉన్నారని గుర్తుచేశారు. ఆనాడు నెట్టెంపాడు పనులను చూసి కాలువలలో, రిజర్వాయర్లలో ముళ్లకంపలు మొలుస్తాయని, నెట్టెంపాడు ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపణలు చేసిన సన్నాసులు ఇప్పుడు తామే నీరు వదులుతున్నట్టు ఫొటోలకు పోజులివ్వడం దురదృష్టకరమన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నందుకే గత మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలు గెలిపించారని, అదే స్ఫూర్తితో మరిన్ని అభివృద్ధి పనులు చేసి ప్రజలు రుణం తీర్చుకుంటానని అన్నారు. అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికో, కులానికో ప్రతినిధి కాదని, భారతదేశం మొత్తం గర్హించదగ్గ మహనీయుడని ఆమె కొనియాడారు. ఆయన స్ఫూర్తిని కొనసాగించి రాజ్యాంగ విలువలను కాపాడాలని సూచించారు. ముఖ్యంగా దళితుల అభ్యున్నతి కోసం ఆయన అనేక సంక్షేమ పథకాలు, చట్టాలు వచ్చే విధంగా రాజ్యాంగాన్ని రచించారని, అందుకే దళితుల గుండెల్లో గూడుకట్టుకొని దేవునిగా ఆరాధించబడుతున్నారని అన్నారు. గ్రామాలలో దళిత కాలనీల్లో విగ్రహాలు పెట్టుకోవడమే కాకుండా ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం గ్రామస్థులు ముందుకు రాగా అన్ని విధాలా సహకరించినందుకు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ శంకర్, దండోరా రాష్ట్ర నాయకుడు సతీష్‌మాదిగ, ఎస్సీ సెల్ చైర్మన్ ఆనంద్, ఎంపీటీసీ శ్రీనివాసులు, కోడిగుడ్ల సలాం, చిన్న, కన్న, అయ్యపురెడ్డి, సర్పంచ్ వసంతలక్ష్మి, పటేల్ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.