మహబూబ్‌నగర్

రైతుబంధుతో రైతులకు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డాకుల, మే 22: రైతుబంధు పథకం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతోందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మం డల కేంద్రంలో స్ర్తిశక్తి భవనం వద్ద మంగళవారం జరిగిన రైతుబంధు కార్యక్రమంలో పాల్గొని రైతులకు చెక్కులు, పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ పెట్టుబడి సాయం కోసం రైతులు ఇబ్బందులు పడకూడదనే దేశంలో ఎవరూ తీసుకోని ధైర్యమైన నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ తీసుకున్నారని చెప్పారు. ప్రతి ఎకరాకు రైతుబంధు పథకాన్ని అందజేస్తామన్నారు. రైతుబంధు పథకంపై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదన్నారు. రైతుల మేలు కోసం ప్రాజెక్టులు కడుతుంటే వాటిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు కేసులు వేస్తున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన ప్రాజెక్టులు పనులు అగకుండా సీఎం కేసీఆర్ పనులు చేయిస్తున్నారని చెప్పారు. రైతుబంధు పథకంతో పెట్టుబడి సాయం అందిస్తూ జూన్ 2 నుంచి రైతులకు బీమా సౌకర్యం కల్పించడానికి రూపకల్పన జరుగుతోందన్నారు. రైతులు అకాల మరణం చెందితే రూ.5లక్షలు పరిహారం వచ్చేవిధంగా బీమా సౌకర్యం ఉంటుందని ఎమ్మెల్యే ఆల పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నర్సింగ్‌రావు, తహశీల్దార్ కల్యాణి, ఎంపీపీ బగ్గి కమలమ్మ, మండల రైతు సమన్వకర్త శ్రీకాంత్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నాగార్జున్‌రెడ్డి, ఏఓ శ్రీనివాసులు, గిర్దావరి మంజుల, అడ్డాకుల సర్పంచ్ కె.రఘు, ఉపసర్పంచ్ భీమన్నయాదవ్, చంద్రమోహన్‌రెడ్డి, రవి పాల్గొన్నారు.

ఉజ్వల ద్వారా రాష్ట్రానికి 21లక్షల సిలిండర్లు
- ఆయూష్మాన్‌భవ పథకం ద్వారా రూ.5లక్షల ఉచిత వైద్యం - బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి

పాన్‌గల్, మే 22: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి 21లక్షల సిలిండర్లు మంజూరైనట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని తెల్లరాళ్ళపల్లి తండాలో ఉజ్వల పథకం ద్వారా మంజూరైన 40 సిలిండర్లను గిరిజన మహిళలకు అయన అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఉచితంగా ఈ పథకం ద్వారా సిలిండర్లను అందజేస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం అనేక బృహత్తర పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. నరేంద్రమోదీ ప్రధాని పదవి చేపట్టాక దేశంలో సర్వే చేయించారని కట్టెల పొయ్యి ఉన్న ప్రతి కుటుంబానికి సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయాలని ఉజ్వల పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. దేశంలో 8కోట్ల సిలిండర్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 2లక్షల ఇండ్లకు మంజూరు ఇచ్చిందన్నారు. ఒక్కొక్క ఇంటికి 1.80లక్షల నిధులు మంజూరు చేసిందన్నారు. 70 లక్షల కళాశాల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం భోజన సదుపాయాలతో పాటు పౌష్టికాహారాన్ని పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో ప్రతి వ్యక్తికి బీమా, భద్రత ఉండాలనే ఉద్దేశంతో సంవత్సరానికి రూ.12 చెల్లిస్తే 14 రకాల ప్రమాదాలకు సంబంధించి, మరణిస్తే రూ.2లక్షల బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. రూ.330 చెల్లిస్తే బీమా సౌకర్యం కింద ప్రమాదంతో పాటు సాధారణ మరణానికి కూడా బీమా వర్తిస్తుందన్నారు. ఆగస్టు 15నుంచి దేశంలో ఎక్కడైన ఏ ఆసుపత్రిలోనైనా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఆయూష్మాన్‌భవ పథకాన్ని మొదటగా 150 జిల్లాలో ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బుడ్డన్న, మోహన్‌నాయక్, గట్టయ్య, మధుసూదన్‌యాదవ్, రాములునాయక్, నవీన్‌రెడ్డి, మల్లిఖార్జున్, రామకృష్ణ, రాముడు, సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.