మహబూబ్‌నగర్

‘మయూరి పార్క్ మహబూబ్‌నగర్ జిల్లాకే తలమానికం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 14: రాష్ట్రంలోనే సుందరమైన పార్క్‌గా మయూరి పార్క్ నిలిచిందని ఈ పార్క్ మహబూబ్‌నగర్ జిల్లాకే తలమానికంగా మారిందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ పట్టణంలోని మయూరి పార్క్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అదేవిధంగా పార్క్‌లో వాటర్ ఫాల్స్‌కై నిర్మిస్తున్న పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. పార్క్‌కు రోజురోజుకు జనం ఎక్కువగా వస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. ఇప్పటికే రూ.2.50 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని మరో రూ,1.50 కోట్లు నిధుల ఖర్చు చేయడం జరుగుతుందని వీటిని దృష్టిలో ఉంచుకుని పార్క్‌లో ఎలాంటి పచ్చదనంతో పాటు పర్యాటకులు చూడటానికి మరిన్ని ఏర్పాట్లు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ విలేఖరులతో మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాకే తలమానికంగా మయూరి పార్క్ నిలిచిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక దాదాపు 300 ఎకరాలకుపైగా అతిపెద్ద పార్క్‌ను మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పాలమూరు జిల్లా కేంద్రాన్ని అద్బుతమైన పట్టణంగా తీర్చి దిద్దడం జరుగుతుందని రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రగామీగా ముందువరుసలో నిలుస్తుందని అన్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో దాదాపు రూ.2500 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఐటీ కారిడార్ పనులు ప్రారంభమైతే ఇక మహబూబ్‌నగర్ ఊహించని రీతిలో ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే వెంట సింగిల్‌విండో చైర్మన్ వెంకటయ్య తదితరులు ఉన్నారు.

స్వర్ణ భరత్ ఏర్పాటు లక్ష్యంగానే బస్సుయాత్ర
* మరికల్‌లో బస్సుయాత్రకు ఘన స్వాగతం
ధన్వాడ, జూలై 14: స్వర్ణ భరత్ ఏర్పాటు లక్ష్యంగానే బస్సుయాత్రను నిర్వహిస్తున్నట్లు బ్రహ్మకుమారి ఈశ్వరయ విద్యాలయం సంస్థ జిల్లా ఇన్‌చార్జి మహాదేవి బెహంజీ అన్నారు. శనివారం మరికల్ మండల కేంద్రంలో బ్రహ్మకుమారి ఈశ్వరయ విద్యాలయం వారి అధ్వర్యంలో పలువార్డులలో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మరికల్ ఇందిరాగాంధీ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ భారతదేశంలో దాదాపు 40 టీంల ద్వారా బస్సు యాత్రలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని యువతను జాగృతం చేసేందుకే ఈబస్సుయాత్రలను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. యువతలో ఉన్న చెడు అలవాట్లను దూరం చేసి దేవుడి మార్గంలో నడిపేందుకు ఈబస్సుయాత్రను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. దేశంలో దాదాపు 4లక్షల 72వేల మందిని చైతన్యం చేసినట్లు తెలిపారు. గ్రామాలలో పరిశుభ్రతను పాటించాలని , ఆరోగ్యమే ముఖ్యలక్ష్యమన్నారు. అందుకు యువకులు ముందుకు రావాలన్నారు. అనంతరం బస్సుయాత్ర నిర్వాహకులను మరికల్ గ్రామనాయకులు సూర్యప్రకాష్, సురేందర్‌గౌడ్, టంకరి శ్రీనివాసులు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో శితల్‌బహింజి, మరికల్ మండల ఇంచార్జి సునీత, కృష్ణయ్య, నారాయణ, సోమనాథం, కె.కృష్ణయ్య, వెంకటేష్‌గౌడ్, శ్రీనివాసులు పాల్గొన్నారు.