మహబూబ్‌నగర్

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు ఎండగట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూలై 14: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను గ్రామగ్రామాన తిరిగి ఎండగట్టాలని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ పిలుపునిచ్చారు. శనివారం గట్టు మండల నాయకులు, కార్యకర్తల సమావేశం జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఈవెంట్ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదని, కేవలం కుటుంబం లబ్ధిపొందేందుకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు పాటుపడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాల పునాదులపై నిర్మించబడిందని, ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించి వాటిని పరిష్కరించలేని స్థితిని వివరించాలని అన్నారు. అదే విధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించాలని సూచించారు. సబ్సిడీ ట్రాక్టర్లు, గొర్రెల పథకంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రజలకు వివరించాలని, ట్రాక్టర్ల ఎంపికలో గోల్‌మాల్ చోటు చేసుకుందని, అధికార పార్టీకి చెందిన నాయకులే కాజేశారని, గొర్రెల
పంపిణీలో అధికారులు, అధికార పార్టీ నాయకులు, కొందరు వ్యాపారులు లబ్ధిదారుల నోట్లో మట్టికొట్టారని అన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, ఉచిత విద్యుత్ పథకాలు కాంగ్రెస్ పుణ్యమే అన్న విషయం ప్రతి ఒక్కరికి వివరించాలని అన్నారు. మిగులు బడ్జెట్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుపగా, అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ కోట్లాది రూపాయల అప్పులను మూటగట్టిందని, పుట్టబోయే బిడ్డ వరకు ప్రతి ఒక్కరికి అప్పు మిగిలిందన్నారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పని చేయాలని, ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు, మనస్పర్థలు ఉంటే కుటుంబంలో కలిసి కూర్చొని పరిష్కరించుకుందామని సూచించారు. కొందరు తల్లిలాంటి పార్టీని వదిలి వెళ్లినంత మాత్రాన వారి నుండి ఎలాంటి నష్టం లేదని, అలాంటి వారిని వందమందిని తయారు చేసే శక్తి కాంగ్రెస్‌కు ఉందని గ్రహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, నాయకులు నందినె్న ప్రకాష్‌రావు, పటేల్ ప్రభాకర్‌రెడ్డి, శివారెడ్డి, మధుసూదన్‌రావు, హన్మంతురెడ్డి, నాగేందర్‌రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగులను మోసగించిన సీఎం
* కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి
వెల్దండ, జూలై 14: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని చెప్పి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. శనివారం వెల్దండ మండల కేంద్రంలోని బ్రహ్మగిరి దేవాలయంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కడారి శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన పూర్వపు వెల్దండ మండల యువజన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నియామకాలు, నిధులు, నీళ్లు వస్తాయని ఓట్లు దండుకున్న ముఖ్యమంత్రి కేసీఅర్ గద్దెనెక్కిన తర్వాత
వాటిన్నింటికి మంగళం పాడారన్నారు. ప్రజలకు ఉద్యోగాల మాట అటుంచి తన కుటుంబంలోనే తనతో పాటు నాల్గురికి ఉద్యోగాలు కల్పించిన ఘనత దేశంలో మన ముఖ్యమంత్రికే దక్కుతుందని ఆయన విమర్శించారు. అదే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సైతం నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం అడుతుందని ఆయన దుయ్యబట్టారు. ఒక రిని మించి ఒకరు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అచరణలో ఎక్కడ కూడ అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సంబండ వర్గాల, అమరవీరుల ఆశయాలు నేరవేరుతాయని తెలంగాణ తల్లి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే బంగారు తెలంగాణ ముసుగులో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశలు కల్పించకుండా పూటాకో నోటిఫికేషన్ పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అటలు అడుకుంటుందే తప్ప ఉద్యోగాలు ఇవ్వడం లేదని వంశీచంద్‌రెడ్డి అరోపించారు. యువతపైనే దేశ, రాష్ట్ర భవిష్యత్తు అధారపడి ఉందని గుర్తిరేగి ఇంకా మోసానికి గురి కాకుండ బీజేపీ, టీఅర్ ఎస్ ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలని, ఇందుకు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈసందర్భంగా యువజన కాంగ్రెస్‌లో చేరిన పలువురి యువతను ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సన్మానించారు. ఈసమావేశంలో జిల్లా నాయకులు తక్కలపల్లి శేఖర్, మండల నాయకులు ఏర్రశ్రీను, రమేష్, అశోక్, రమేష్‌గౌడ్, రాజు, లాలయ్య, శ్రీకాంత్‌గౌడ్, గోపి, లోకిలాల్, ఈదయ్యాదవ్, తిరుపతిగౌడ్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.