మహబూబ్‌నగర్

శక్తి కేంద్రాలతో ముందుకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 14: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఒక రోజు తెలంగాణ పర్యటన ముగిసిన తడవే బీజేపీ నాయకులు తమ రాజకీయ వ్యూహలకు రంగం సిద్ధం చేశారు. జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చేసిన సూచనలను అమలు చేసి పాలమూరు జిల్లాలో బీజేపీని గెలుపించుకొనేలా ఆప్పుడే నాయకులు తమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అయితే విధానపరమైన నిర్ణయాల్లో భాగంగా బీజేపీని గ్రామ స్థాయిలో పట్టిష్టం చేసుకుని పార్టీకి ఓటు బ్యాంకును పెంచుకునేందుకు కొత్త ఒరవడికి ఇప్పటికే శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శక్తి కేంద్రాల పేరిట గ్రామ స్థాయిలో పనిని ప్రారంభించిన బీజేపీ నేతలు అమిత్‌షా పర్యటన ముగిసిన మరుసుటి రోజే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన్నట్లు పలువురు సీనియర్ బీజేపీ నాయకులు చెబుతున్నారు. అయితే ఈ ఏడు నియోజకవర్గాల్లో ఇప్పటికే బూత్ కమిటీలను పూర్తి చేసుకుని వాటి ద్వారా శక్తి కేంద్రాల సభ్యుల పర్యావేక్షణలో పార్టీకి ఓటు బ్యాంకు మళ్లించే విధంగా ఇక వ్యూహలను పదునుపెట్టే కార్యక్రమాలకు బీజేపీ నాయకులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒక నియోజకవర్గంలో 250 బూత్‌లు ఉంటే ఆ బూత్ కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి బూత్ నుండి రాబోయే ఎన్నికల్లో దాదాపు 200 నుండి 250 ఓట్లు రాబట్టేందుకు పక్కా ప్రణాళికలు బీజేపీ నాయకులు శక్తి కేంద్రాల ద్వారా వ్యూహరచనలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 1025 బూత్ కమిటీలను పూర్తి చేసినట్లు సమాచారం. అయితే ఈ కమిటీల సభ్యులను శక్తి కేంద్రాల ద్వారా బలోపేతం చేసి వాటి ద్వారా ఓట్లు రాబట్టుకునే విధంగా రాజకీయ వ్యూహలకు పదునుపెడుతున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై జాతీయ పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మజారెడ్డి తెలిపారు. ఈ పార్లమెంట్ స్థానంలో కనీసం నాలుగు లేదా ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే విధంగా తమ ప్రణాళికలు ఉండబోతున్నాయని ఆమె వెల్లడించారు. కాగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో ఏడు, లేదా ఎనిమిది నియోజకవర్గాల్లో గట్టిపోటీ ఇవ్వడమేకాకుండా అనూహ్యమైన విజయాలు సాధించేందుకు బీజేపీ నాయకత్వం ఆలోచిస్తుండడంతో ఇక నియోజకవర్గాల్లో దూకడు పెంచాలని నేతలు భావిస్తున్నారు. ఇందుకుగాను శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలు, బూత్‌కమిటీ సభ్యులు దాదాపు మూడు నెలల పాటు నిరంతరంగా క్షేత్ర స్థాయిలో పని చేయాలని బీజేపీ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఓ ప్రణాళికలను సిద్దం చేసిన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఇప్పటికే పని ప్రారంభించిన బీజేపీ నేతలు ఇక మూడు నెలల నాటికి 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శక్తి కేంద్రాలను విస్తరింప జేసి కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు ధీటుగా ఎదగాలని రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించాలని నేతలు భావిస్తున్నారు. అయితే సంఘ్‌పరివార్ సహాయం కూడా తీసుకోవాలని క్షేత్ర స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు తీసుకుని ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్దం అనే సంకేతాలు ఇవ్వనున్నారు. గత నెలలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేపట్టిన జనచైతన్యయాత్ర జిల్లాలో విజయవంతం కావడం అందుకు ప్రధానంగా పలు నియోజకవర్గాల్లో శక్తి కేంద్రాలు, బూత్ కమిటీ సభ్యులు పనితీరే అందుకు నిదర్శనమని జిల్లా నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కల్వకుర్తి, వనపర్తి, నియోజకవర్గాల్లో దాదాపు శక్తి కేంద్రాలు, బూత్ కమిటీల ప్రక్రీయ ఇప్పటికే పూర్తి అయిన్నట్లు తెలుస్తుంది. ఈ నియోజకవర్గాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సత్తా చాటేందుకు బీజేపీ నాయకులు సై అంటున్నారు.
ఇదిలా ఉండగా గద్వాల, అలంపూర్, కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొడంగల్, జడ్చర్ల నియోజకవర్గాల్లో ఇక రెండు మూడు నెలల్లో శక్తి కేంద్రాల విస్తరణ, బూత్ కమిటీల ఏర్పాటు పూర్తి చేసి ఈ నియోజకవర్గాల్లో కూడా బలమైన శక్తిగా ఎదగాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరాటానికి సిద్ధం కావడంతో ఇక నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి శక్తి కేంద్రాల సభ్యుల దూకుడు పెంచేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తుంది.