మహబూబ్‌నగర్

పేద విద్యార్థినికి ఎంఎస్‌ఆర్ చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 14: మహబూబ్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ యువనేత సురేందర్‌రెడ్డి(ఎంఎస్‌ఆర్) ఓ పేద కుటుంబానికి చెందిన విద్యార్థినికి ఎంబీబీఎస్ ఉన్నత చదువు కోసం శనివారం చేయూతను అందించారు. మహబూబ్‌నగర్ పట్టణం హన్‌మాన్‌పూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ శ్రీనివాసులు కూతురు నందిని ఎంబీబీఎస్ సీటులో 148వ ర్యాంకు సాధించింది. అయితే సీటు సాధించాలంటే ఫీజు చెల్లించాల్సిందే కానీ ఆర్థిక పరిస్థితులు బాగులేకపోవడం నందినిని తీవ్ర కలతకు గురించేసింది. తాను ఎంబీబీఎస్ చదవాలంటే ప్రస్తుతం రూ.60 వేలు చెల్లించాల్సిందని తల్లిదండ్రులకు ఆమే చెప్పింది. దాంతో తండ్రి శ్రీనివాస్, తల్లి లలిత దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అయితే తమ బిడ్డ భవిష్యత్ కోసం ఎవరు చేయూతను ఇస్తారని ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ యువనేత ఎంఎస్‌ఆర్ దృష్టికి ఈ విషయం వచ్చింది. ఎంఎస్‌ఆర్‌ను గత వారం రోజుల క్రితం ఆటోడ్రైవర్ శ్రీనివాసులు ఎంఎస్‌ఆర్‌ను సంప్రదించి తమ కుటుంబ పరిస్థితిని వివరించి తన గోడును వెలబోసుకుని తన కూతురు భవిష్యత్‌ను కాపాడాలంటూ కన్నిరు రాల్చాడు. ఇందుకు స్పందించిన ఎంఎస్‌ఆర్ దైర్యంగా ఉండాలని తాను సహయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం నందినికి రూ.60 వేలు కాంగ్రెస్ యువనేత సురేందర్‌రెడ్డి అందజేశారు. ఓ పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని ఎంబీబీఎస్ చేస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుందని ఇలాంటి పేద విద్యార్థులకు సహయం చేయడంలోనే జీవితంలో తృప్తి ఉంటుందని అన్నారు. విద్యార్థిని నందిని చదువు పూర్తి అయ్యే వరకు తాను చేయూతను అందిస్తానని దైర్యంగా చదువుకోవాలని నందినికి సురేందర్‌రెడ్డి సూచించారు.