మహబూబ్‌నగర్

మహిళల కన్నీరు తుడిచేందుకే ‘ఉజ్వల’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీపనగండ్ల, జూలై 17: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ఉజ్వల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గోపల్‌దినె్న గ్రామంలో ఉజ్వల యోజన పథకం ద్వారా మంజూరైన సిలిండర్లను లబ్దిదారుల కు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ దేశంలో 8 కోట్ల ఇండ్లకు ఉచితంగా సిలిండర్లు పంపిణి చేయడం జరుగుతుందని, కట్టెల పోయ్యి వాడుతుండడం వల్ల మహిళలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వారి బాధలను అర్థం చేసుకొని ప్రదాన మంత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి రెండు లక్షల ఇండ్ల నిర్మాణం కోసం నిధులు పంపిణీ చేసినా రాష్ట్రం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మహిళలు ఆత్మ అభిమానాన్ని కాపాడుకోవడానికి స్వచ్చ్భారత్ ద్వారా ప్రతి కుటుంబానికి రూ.12వేలతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఆరుకాలం రైతు కష్టపడి పండించిన పంటకు దళారుల చేతుల్లో వెళ్ళకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర కల్పించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి హరితహారం కింద నిధులు ఇవ్వడం , అలాగే సీసీ రోడ్డు నిర్మాణానికి, ఉపాధి హామీ పనులకు కేంద్రం నిధులు పంపిణీ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వీటిని సక్రమంగా వినియోగించడం లేదని విమర్శించారు. మంత్రి జూపల్లికృష్ణారావు సోమశిల బిడ్జి నిర్మాణానికి కావల్సిన నిధులు సాదించలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. నిరుపేదల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని అందులో భాగంగానే ఆగష్టు 10 నుంచి ప్రతి కుటుంబానికి లబ్ది చేకురేలా నూతన పథకాలను ప్రవేశపెడుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ప్రకాష్‌శెట్టి, జిల్లా వాణిజ్య సెల్ కో కన్వీనర్ శివాజి, అసెంబ్లీ ఇన్‌చార్జి సంతోష్, మోహన్‌గౌడ్ ఉన్నారు.

రజకార్ల పాలనను తలపిస్తున్న కేసీఆర్
* బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి
మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 17: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రజకార్ల పాలన నడుస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి ఆరోపించారు. మంగళవారం బీజేపీ నాయకులను గృహనిర్భదం చేసినందుకుగాను బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టబొమ్మను తెలంగాణ చౌరస్తాలో దగ్థం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బతుకులు మారుతాయన్న ప్రజలకు నిరాశే మిగిలిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ పేరుతో బానిసల తెలంగాణగా మార్చిన ఘనుడని ఆమె విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు పాండురంగారెడ్డి, పడాకుల బాలరాజు, చింతల మధుసూదన్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.