మహబూబ్‌నగర్

పేదలకు అండగా ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 17: పేదలకు తాను అండగా ఉంటానని, కాంగ్రెస్ పేదల పార్టీ అని.. వారి కోసమే నిరంతరంగా కృషి చేస్తున్న ఏకైక పార్టీ అని పార్టీ మహబూబ్‌నగర్ నియోజకవర్గ యువనేత సురేందర్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని వేపూర్, లింగన్నపల్లి, టంకర, కొత్తపేట, మునిమోక్షం, రామచంద్రాపురం, కొటకదిర, క్రిష్టియన్‌పల్లి గ్రామాలకు చెందిన వలస కుటుంబాలను హైదరాబాద్‌లో మం గళవారం సురేందర్ రెడ్డి కలుసుకున్నారు. ఉదయం వారు ఉంటే బస్తీల్లోకి వెళ్లి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వలస వచ్చిన వారంత కాంగ్రెస్ పార్టీలో చేరాలని విజ్ఞప్తి చేయడంతో వలస కూలీల కుటుంబాలు సరేనని ఒప్పుకున్నారు. దీంతో హైదరాబాద్‌లోని రాంనగర్‌లో గల సురేందర్‌రెడ్డి ఇంటికి వందలాదిమంది పాలమూరు వలస కూలీలు అక్కడికి వచ్చి సురేందర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ యువనేత సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి సంబంధించిన 300 మంది వలస కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో తమ సమక్షంలో చేరడం వారందరిని తాము ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన వలస కూలీల కుటుంబాలను తాను గతవారం రోజుల నుంచి కలుసుకుంటున్నానని వారి బాధలు చూస్తుంటే కన్నీరు వస్తుందని అన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం వలసలు వెళ్లిన పాలమూరు ప్రజలు తిరిగి సొంత గ్రామాలకు వస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లోని ప్రతి కూలీ అడ్డాపై పాలమూరు ప్రజలే కూలీలుగా దర్శనమిస్తున్నారని ఇది విచారకరమైన అంశం అన్నారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తాను నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కారణంగా వలసలు బంద్ అయ్యాయని ప్రచారం చేస్తున్నారని ఇది శుద్దఅబద్దం అన్నారు. హైదరాబాద్‌లో వలస కూలీలుగా బతుకుతున్న మహబూబ్‌నగర్ నియోజకవర్గ ప్రజలకు తాను ఎల్లవేళలా తోడుగా ఉండి అండగా నిలుస్తానని, ఎవరికి ఏ అపద వచ్చిన ఆదుకుంటానని పెర్కోన్నారు.
వలసలు వచ్చిన వారి పిల్లలను తప్పకుండా చదివించాలని ఆయన కోరారు. తాను ప్రజల సమస్యలను లేవనెత్తుతుంటే తన వెంట వస్తున్న వారిపై ఎమ్మెల్యే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని తుదిశ్వాస ఉన్నంతవరకు ప్రజలకు అండగా నిలుస్తానని తెలిపారు.