మహబూబ్‌నగర్

మహిళలు నిర్భయంగా జీవించొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనఫర్తి, జూలై 19: వనపర్తి జిల్లాలో మహిళలు , విద్యార్థినులు నిర్భయంగా తమ పనులు తాము చేసుకుంటూ జీవించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అదనపు ఎస్పీ భాస్కర్ అన్నారు. గురువారం వనపర్తి ఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డి ఎస్పీ సృజనతో కలిసి మాట్లాడారు. 2016 నుండి షీ టీంలు పని చేస్తున్నప్పటికి వారికి గతంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వలేదన్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని నూతన వరవడితో , ఆధునాతన పరికరాలను ఉపయోగించుకొని మహిళలపై వేదింపులు , ఈవ్‌టీజింగ్ తదితర అసాంఘిక చర్యలు జరగకుండా అరికడుతున్నట్లు చెప్పారు. వనపర్తి జిల్లాలో ఎస్పీ , డి ఎస్పీ మహిళలే ఉన్నారని, నిర్బయంగా మహిళలపై వేదింపులు జరిగితే వారి దృష్టికి తీసుకేళ్లాలని, మహిళల పేర్లు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. హాట్‌స్పాట్ ( వేదింపులు జరిగే స్థలాలు) హాట్ టైం ( నేరాలు జరిగే సమయం) గుర్తించి అక్కడ సిసి కెమేరాలను ఏర్పాటు చేయడంతో పాటు మఫ్టిలో షీ టీమ్స్‌ను ఉంచడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం వనపర్తిలో పది షీ టీంలు తిరుగుతున్నాయని, వాటిని 20కి పెంచుతామని తెలిపారు. 2016లో 218, 2017లో 233,2018లో ఇప్పటి వరకు 55 సంఘటనల్లో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. షీ టీమ్స్‌లకు పెన్ కెమేరాలు ఇచ్చి ముందుగా సంఘటనను రికార్డు చేసి అదుపులోకి తీసుకునే విధంగా చూస్తామని చెప్పారు. మహిళలు నిర్బయంగా తమ పనులు చేసుకునే విధంగా జిల్లాలను శాంతికి నీలయంగా నిలుపుతామని చెప్పారు. జిల్లా కేంద్రంలోనే కాకుండా గ్రామాలలో కూడా సీసీ కెమేరాలు ఏర్పాటు చేయనున్నట్లు అందులో భాగంగా పెద్దగూడెం గ్రామంలో అయిదు సిసి కెమేరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం షీ టీమ్స్ లోగోను వారు విడుదల చేశారు.
21న ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌కు సన్మానం
* డీసీసీ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్
మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 19: ఏఐసీసీ కార్యదర్శిగా నియమాకమైన అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను ఈ నెల 21న జిల్లా కేంద్రంలో ఘనంగా సన్మానించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ తెలిపారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏఐసీసీ కార్యదర్శిగా తొలిసారి మహబూబ్‌నగర్ పట్టణానికి వస్తున్న సంపత్‌కుమార్‌ను పార్టీతో పాటు అన్ని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక గ్రౌన్‌గార్డెన్ ఫంక్షన్‌హల్‌లో సన్మానించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని నేతలు, కార్యకర్తలు, ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నాలని ఆయన కోరారు. విలేఖరుల సమావేశంలో మీడియా సెల్ కన్వినర్ బెనహర్, కాంగ్రెస్‌నాయకులు పాల్గొన్నారు.