మహబూబ్‌నగర్

2019లో కాంగ్రెస్‌థే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, జూలై 19: దేశంలో రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, 2019లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమే ప్రతి పక్షాల ఎజెండాగా ముందుకు అడుగులు వేస్తున్నారని ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి చిత్తరంజన్‌దాసు అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో బీసీలకు 60 శాతం సీట్లు ఇవ్వాలని, పాలమూరు పార్లమెంట్ టికెట్ బీసీలకు కేటాయించాలని మాజీ మంత్రి కోరారు. దేశంలోని ఓబీసీ సంఘాల నాయకులు రాహుల్‌గాంధీ నాయకత్వంలో పని చేస్తున్నారని, సీడబ్ల్యుసీలో తమరధ్వజ సాహుకు అవకాశం కల్పించి ఓబీసీల గౌరవం పెంచిందని, అలాగే పార్టీ నుండి వెళ్లిన ఓబీసీలను పార్టీలోకి అహ్వానించి సముచిత స్థానం కల్పించేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి అన్నారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారిని పక్కకు పెట్టి పని చేసిన వారికే సీడబ్ల్యుసిలో అవకాశం కల్పించడం హార్షణీయమని ఆయన తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు నాపై పూర్తి నమ్మకంతో ఉన్నారని ఆయన పేరొన్నారు. విలేఖరుల సమావేశంలో పెద్దయ్యయాదవ్, లక్ష్మయ్య, పాండు, గోపాల్, సలీం, రాజు తదితరులు ఉన్నారు.
లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి
* కలెక్టర్ రోనాల్డ్‌రోస్

మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 19: ఉద్యోగాల కోసం పోటీపడే నిరుద్యోగులు లక్ష్యంతో పరీక్షలకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ నిరుద్యోగ యువతకు సూచించారు. గురువారం పట్టణంలోని బాదం ఆడిటోరియంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకై సిద్ధమవుతున్న యువతకు ఇటీవల పోలీసులు ఇచ్చిన ఉచిత శిక్షణ తీసుకున్న యువతీ యువకులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ కాలంలో నేర్చుకున్న అంశాలను నిరంతరం గుర్తు చేసుకుంటూ కరెంట్ అఫైర్స్‌పై శ్రద్ధ పెట్టాలన్నారు. ముఖ్యంగా సిలబస్ గురించి ఆందోళన చెందకుండా కఠినంగా అనిపించే సబ్జెక్టులలో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. ప్రతిరోజు గ్రూప్ డిస్కషన్ వల్ల విషయాలు మనసులో నాటుకుంటాయని వేరువేరు పోటీ పరీక్షలకు సిద్ధపడే వారు తమ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పుస్తకాలను ఎంచుకోవాలని కోరారు. అదేవిధంగా ఎస్పీ అనురాధ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగంలో శారీరక, మానసిక ధృడత్వానికి పరీక్షగా నిలుస్తుందని రాతపరీక్షతో పాటు మైదానంలో ఎదుర్కోవల్సిన క్రీడాంశాల పట్ల పట్టుదలతో కృషి చేయాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న యువతీ, యువకులు జిల్లా తరపున అధికస్థాయిలో ఉద్యోగాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోఅడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, నిరుద్యోగులు, శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులు తదితరులు పాల్గొన్నారు.