మహబూబ్‌నగర్

పరిపూర్ణానంద నగర బహిష్కరణకు నిరసనగా హిందూ వాహిని రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, జూలై 19: స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణకు నిరసనగా హిందూవాహినీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. హిందూ వాహినీ కార్యకర్తలతోపాటు వీహెచ్‌పీ, భజరంగదళ్ తదితర హిందూ సంస్థలు, బీజేపీ నేతలు సంఘీభావం తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని కిరాణ మర్చంట్ ఆధ్వర్యంలో కిరాణ దుకాణాలను బంద్ చేసి నిరసన తెలిపి వారికి సంఘీభావం తెలిపారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపుల భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి రాకపోకలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని రాస్తారోకో విరమించాలని కోరినా వినకపోవడంతో దానిని భగ్నం చేసి రాస్తారోకో చేస్తున్న వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బుసిరెడ్డిసుబ్బారెడ్డి, హిందూ వాహిని నాయకులు జక్క రాజ్‌కుమార్‌రెడ్డి, జంగయ్య, వివిధ సంఘాల నేతలు రాములు, యాదగిరిరావు తదితరులను పోలీసులు బలవంతంగా వాహనాలలో ఎక్కించారు. అంతకుముందు ధర్నానుద్దేశించి పలువురు మాట్లాడుతూ భారతదేశంలో హిందు ధర్మరక్షణ కోసం పాటుపటుతున్న స్వామి పరిపూర్ణనందపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం, నగర బహిర్కరణ చేయడం దారుణమన్నారు. హిందూమతంపై ముఖ్యంగా భారత ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీరాముడుపట్ల నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేసిన వారిని, ఒక టీవీలో దీనిపై ప్రసారం చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, ప్రసారం చేసిన టీవీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్‌కు తరలించిన వివిధ సంస్థల నేతలను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బుసిరెడ్డి సుబ్బారెడ్డి, హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు జక్క రాజ్‌కుమార్‌రెడ్డి, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షులు దొడ్ల నారాయణరెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షులు ఎలిమె రాము, వివిధ సంస్థల నేతలు పిడికిల్ల జంగయ్య, యాదగిరిరావు, నరేష్, విష్ణు తదితరులు ఉన్నారు.