మహబూబ్‌నగర్

బిరాబిరా కృష్ణమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, జూలై 19: ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ బిరాబిరా పరుగులు పెడుతూ జూరాలను తాకింది. గురువారం తెల్లవారు జామున నుండే జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కగా ప్రాజెక్టు పరిసర ప్రాంతాలకు జలకళ వచ్చింది. ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గురువారం మధ్యాహ్నం వరకు నీరు వచ్చి చేరడంతో మక్తల్ మండలం పంచదేవ్‌పాడ్ దగ్గర 317 క్యూసెక్కుల నీరు ఉందని భీమా ప్రాజెక్టు ఇంచార్జి ఈఈ విజయనందన్ తెలిపారు. ఈసందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ బుధవారం చిన్న గోప్లాపూర్ సమీపంలోని ఫేస్-1 పంపు హవుజ్ ద్వారా ఒక మోటారు ద్వారా నీటిని విడుదల చేయగా గురువారం 11-00 గంటలకు మరో పంపును ప్రారంభించడంతో ఒక్కో పంపు ద్వారా 650 క్యూసెక్కులు మొత్తం 1300 క్యూసెక్కుల నీటిని ఇటు భూత్పూర్, అటు సంగంబండకు రిజర్వాయర్లకు విడుదల చేసినట్లు ఈఈ తెలిపారు. వీటిలో భూత్పూర్‌కు 500 క్యూసెక్కుల నీరు విడుదల కాగా మక్తల్ సమీపంలోని ఖానాపూర్ దగ్గర గల స్టేజ్-కు 800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని చెప్పారు. కాగా ఈస్టేజ్ దగ్గర ఉన్న రెండు పంపులద్వారా ఒక్కో పంపు నుండి 400 క్యూసెక్కుల సామర్థ్యంతో మొత్తం 800 క్యూసెక్కుల నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా సంగంబండ రిజర్వాయర్‌కు విడుదల చేసినట్లు తెలిపారు. సంగంబండ రిజర్వాయర్‌కు వెళుతున్న నీటి నుండి మక్తల్ పెద్ద చెరువుకు సైతం విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఈఈ విజయనందన్ తెలిపారు.
గేట్లు ఎత్తివేత
గద్వాల: జూరాల జళాశయంలో 317.600 మీటర్ల స్థాయిలో నీరు గురువారం సాయంత్రం నాటికి నిల్వ ఉంచుకొని ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న లక్షా రెండు వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల కుడి, ఎడుమ కాలువలకు 1115 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు లిప్ట్‌కు 2250, బీమా లిప్ట్-1, లిప్ట్-2లకు 3000, కోయిల్‌సాగర్ 630, సమాంతర కాలువలకు 1200, విద్యుత్ ఉత్పత్తికి 31,000 క్యూసెక్కుల గేట్ల ద్వారా 10వేల క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుండి దిగువకు వదులుతున్నట్లు జూరాల అధికారులు తెలిపారు. జూరాల నుండి దాదాపు 70వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి జళాశయంలో 129.72 టీయంసీలకు గాను 113.4 టీయంసీల నీటిని నిలువ ఉంచుకొని నాలుగు గేట్లను తెరిచి దిగువకు 1,62,093 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి ఆల్మట్టికి 1,62,093 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. నారాయణపూర్ జళాశయంలో 37.64 టీయంసిలకు గాను 33.38 టీయంసీల నీరు నిలువ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి 1,60,620 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు 5 గేట్లను తెరిచి దిగువకు 1,53,248 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాలకు వస్తున్న వరద నీటి ఉధృతి రాత్రి మరింత పెరిగే అవకాశాలు ఉన్నందున అర్ధరాత్రి వరకు ప్రాజెక్టు 10 గేట్లను తెరిచే అవకాశాలున్నాయని జూరాల అధికారులు తెలిపారు. జూరాలకు వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకొని జూరాల జలవిద్యుత్ కేంద్ర అధికారులు 4 యూనిట్ల ద్వార విద్యుత్ ఉత్పత్తిని చేపడుతున్నారు. అర్దరాత్రి వరద ఉధృతి పెరిగితే 6 యూనిట్ల ద్వార విద్యుత్ ఉత్పత్తి చేప్పటే అవకాశాలున్నాయని జెన్ కో అధికారులు తెలిపారు.
ఆనందంలో మక్తల్ పెద్ద చెరువు ఆయకట్టు రైతులు
మక్తల్: సంగంబండ రిజర్వాయర్‌కు కృష్ణానదిలోని జూరాల బ్యాక్ వాటర్ నీటిని పంపింగ్ చేస్తున్న నేపథ్యంతో మక్తల్ చెరువుకు నీరు వచ్చి చేరుతుండటంతో చెరువు ఆయకట్టు రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మక్తల్ పెద్ద చెరువు క్రింద మొత్తం 418 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. మక్తల్ పెద్ద చెరువును మిని ట్యాంకు బండగా మార్చడంతోటి చెరువులోని సిల్ట్‌ను చాలా మట్టుకు తీయడంతో ఈఖరీఫ్‌లో నీటి నిలువ అధికంగా ఉంటుందని రైతన్నలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మక్తల్ పెద్దచెరువు రూపురేఖలు మారే అవకాశం ఉండటంతో ఇటు రైతులు, ఆటు మత్య్సశాఖ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 6,7ఏళ్ల క్రితం మక్తల్ పెద్ద చెరువు క్రింద ఒక పంటను సైతం పండించుకోని పరిస్థితి ఉండేదని రైతులు అంటున్నారు. మొన్న యాసంగి పంటలు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాదాపు 300 ఎకరాలకు పైగా రైతులు సాగుచేసుకొని పంటలు పండించుకోవడం జరిగింది.

అందివచ్చిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి
* మంత్రి జూపల్లి
కొల్లాపూర్, జూలై 19: నిరుద్యోగ యువతీ, యువకులు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిరుద్యోగ యువతీ, యువకులకోసం డీఆర్‌డీఎ, ఇజీఎంఎం ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 56 కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. రెండువేల మంది యువతీ, యువకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ 2016లో పట్టణంలో జాబ్‌మేళా నిర్వహించగా రెండువేల మంది వచ్చారని, వారిలో 1650 మంది ఎంపికయ్యారని వారిలో 250 మంది మాత్రమే ఉద్యోగాలలో స్థిరపడ్డారని, మిగతా వారు వేతనాలు తక్కువగా ఉన్నాయనో, ఇతరాత్ర కారణలతో ఆయా ఉద్యోగాలలో నిలువలేకపోయారని అన్నారు. గతంలో నిర్వహించిన జాబ్‌మేళాలో ఎంపికై ప్రస్తుతం జాబ్ చేస్తున్న కొంతమంది ఉద్యోగులు ఈ సమావేశానికి హాజరై తమ అనుభవాలను వివరించారు. ప్రస్తుతం రూ.18వేల నుంచి రూ.22వేల వరకు వేతనాలను పొందుతున్నామని, అద్దె ఇతర ఖర్చులకు రూ.3500లు పోగా మిగతా డబ్బులతో వివిధ అంశాలలో కోచింగ్ తీసుకోవడం, చదువుకోవడం జరుగుతుందని కొంతమంది తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ తాను రూ.150 జీతం నుంచి మంత్రి స్థాయి వరకు ఎదిగినట్లు తెలిపారు. ఉద్యోగంలో చేరిన వెంటనే లక్షల జీతం కావాలంటే దొరకవని, కష్టపడి ఉద్యోగాలలో చేరి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నందుననే ఇలాంటి అవకాశాలు మీకు వస్తున్నాయని అన్నారు. వీటిని ఆషామాషీగా భావించకుండా ఉద్యోగాలు సాధించుకోవాలని, బంగారు తెలంగాణ అంటే ప్రతి ఒక్కరు బాగుపడటమేనని అన్నారు.