మహబూబ్‌నగర్

నిండుకుండలా పర్దిపూర్ రిజర్వాయర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నచింతకుంట, జూలై 21: ముసురు వర్షాలకు కుంటలు నిండకాపోవడంలో భూగర్బజలాలు అడుగంటిపోతుండడంతో దిగాలు పడుతున్న రైతన్నకు ఊపిరి పీల్చేలా ఇతర రాష్ట్రాలలో కురిసిన వర్షాలకు నదులు పోగి పోర్లడంలో జూరాల ప్రాజెక్టుకు వరద నీరు చేరుకోవడంతోజిల్లాలోని రిజర్వాయర్‌లకు నీటిని మళ్లించి నింపుతున్నారు. మండలంలోని పర్దిపూర్ రిజర్వాయర్‌లోకి బుధవారం నుండి నీటిని వదులుతుండడంతో శనివారం రిజర్వాయర్ నిండుకుండలా కనిపించింది. ఉంద్యాల ఫేజ్-2 నుంచి ప్రతిరోజు 630 క్యూసెక్కుల నీటిని పర్దిపూర్ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నామని నీటిపారుదల శాఖ డిఇ చందునాయక్ తెలిపారు. రిజర్వాయర్ నిండుకుని అలుగు పారుతూ కృష్ణమ్మ పరుగులు పెడుతుందని అయన తెలిపారు. రిజర్వాయర్ 65 మిలియన్ క్యూపిట్ నీటి సామర్థ్యం కలిగి ఉందని డిఇ తెలిపారు. అలుగు పారుతున్న నీరు వడ్డెమాన్ సమీపంలోని కడ్తాల్‌కు చేరుకుని గోలుసు కట్టు కాల్వల ద్వారా మండలకేంద్రంలోని పెద్ద చెరువుకు చేరుకుంటాయని అయన తెలిపారు. రిజర్వాయర్ వద్ద నీటి నిల్వను పరిశీలించడం జరిగిందని డిఇ తెలిపారు. మండంలోని కాల్వలను పరిశీలిస్తున్నట్లు అయన తెలిపారు.రిజర్వాయర్‌లోకి నీరు చేరుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పర్దిపూర్ గ్రామ సర్పంచ్ రాము తెలిపారు.