మహబూబ్‌నగర్

శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, జూలై 21:ప్రజల భద్రత, రక్షణకోసమే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు. శనివారం తెల్లవారుజామున పట్టణంలోని 12వ వార్డులోని పాపయ్యనగర్ కాలనీ, సంజయ్‌నగర్, రవి థియేటర్ ప్రాంతంలో దాదాపు 3గంటల పాటు ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించి ప్రతి ఇంటిని సోదా చేశారు. అనుమానితులను ప్రశ్నించి తగిన ఆధారాలను చూపడంతో వదిలేసి, అనుమానంగా ఉన్న 8 మందిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తీసుకొని పోయారు. 208 ఇళ్లలో సోదాలు నిర్వహించి ఎలాంటి అనుమతులులేని 58 ద్విచక్ర వాహనాలు, మూడు కార్లు, 11 ఆటోలు, ఒక డీసీఎంలను సీజ్ చేశారు. ఎవ్వరు కూడా ఎలాంటి భయాందోళనకు గురికావద్దని పోలీసులు ముందుగానే ప్రజలకు వివరించి ఆయా ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అనుమానంగా ఉన్న వారిని ప్రశ్నించి తగిన ఆధారాలు చూపిన తరువాత వదిలేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ విలేఖరులతో మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ వివిధ రకాల పనులు చేసుకుంటూ దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉన్నందున, వారిలో భయం కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. పోలీసులు ఏ సమయంలోనైనా ఎక్కడైనా వచ్చి తనిఖీ చేస్తారనే విషయాన్ని తెలియచేసేందుకే కార్డెన్ సెర్చ్ కార్యక్రమం అన్నారు. కాలనీలో కొత్తగా వచ్చే వారిపై నిఘా ఉంచాలని, ఇంటిలో అద్దెకు వచ్చిన వారి పూర్తి వివరాలను తెలుసుకున్న తరువాతనే ఇళ్లను అద్దెకు ఇవ్వాలని సూచించారు. కాలనీవాసులందరూ తమ కాలనీలలో నేనుసైతం కమ్యూనిటీ సీసీ కెమెరా కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇందుకు కాలనీల ప్రజలు ఎలాంటి నేరాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటామని ముందుకు వచ్చారని తెలిపారు. అసాంఘిక శక్తుల నుంచి అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే 100కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలతో మాట్లాడుతూ ఇటీవల ఎక్కడో జరిగిన సోషల్ మీడియాలో ఉద్దృతంగా ప్రచారం చేయడం వల్ల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అలాంటి వదంతులను వాట్సప్, ఫేస్ బుక్‌లో ప్రచారం చేయడం కారణంగా ప్రజలలో అనవసరమైన భయాందోళనలు నెలకొంటున్నాయని, ఇలాంటి వదంతులను నమ్మవద్దన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను అనవసరంగా ఫార్వర్డ్ చేస్తున్నారని ఇలాంటి ఫేక్‌న్యూస్ షేర్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సన్‌ప్రీత్ సంగ్‌తోపాటు ఎఎస్పీ జోగుల చెన్నయ్య, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతోపాటు 218 మంది సిబ్బంది పాల్గొన్నారు.