క్రైమ్/లీగల్

ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంగూరు, ఆగస్టు 10: మండల పరిధిలోని ఉప్పలపహాడ్ గ్రామానికి చెందిన అభంశుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన దేవయ్య(52) అనే వ్యక్తి కామంతో కళ్లుమూసుకొని పోయి గురువారం రాత్రి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం చిన్నారి ఇంటిముందు ఒంటరిగా ఆడుకుంటున్న సమయంలో నిందితుడు బుజ్జగించి, మాయమాటలు చెప్పి ఇంట్లోకు తీసుకొని వెళ్లి అత్యాచారానికి యత్నించగా ఇరుగుపొరుగు వారు గమనించడంతో పరారయ్యాడు. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సీఐ గిరికుమార్, ఎస్సై శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మూడునెలల పసిబాలుడి కిడ్నాప్
* రెండుగంటల్లో ఛేదించిన పోలీసులు * నిందితుల ఆరెస్టు: ఎస్పీ అనురాధ
మహబూబ్‌నగర్‌టౌన్, ఆగస్టు 10: మూడునెలల పసిబాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా నారాయణపేట పోలీసులు గమనించి నిందితులను పట్టుకుని ఆరెస్టు చేసినట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ అనురాధ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ అనురాధ మాట్లాడుతూ దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లికి చెందిన మంజుల కుమారుడు మూడు నెలల బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. అదే మండల పరిధిలోని జిలాల్‌పూర్‌కి చెందిన సత్యమ్మ మంజుల మూడేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి ఆమె నాయనమ్మ సాయమ్మకు ఇచ్చింది. సాయమ్మ, సత్యమ్మ భర్త లాలప్పకు అప్పజెప్పింది. దీంతో లాలప్ప, సత్యమ్మ ఇద్దరూ కలిసి ఓ బైక్‌పై బాలుడిని తీసుకెళ్తుండగా నారాయణపేట మండల శివారులో ఓ గుడి దగ్గర అనుమానాస్పదంగా ఉన్న వీరిని నారాయణపేట పోలీసులు గమనించారు. బాలుడు పెద్దగా ఏడుస్తున్నా సత్యమ్మ, లాలప్ప పెద్దగా పట్టించుకోకపోవడంతో పోలీసులు నేరుగా వారి దగ్గరకు వెళ్లి బాలుడు ఏడుస్తున్నాడు పాలివ్వాలని సూచించారు. అయితే వారు కంగారు చూసి పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే సత్యమ్మ, లాలప్పను పట్టుకుని బాలుడిని పోలీసులు తీసుకున్నారు. బాలుడిని కిడ్నాప్ చేసిన రెండు గంటల వ్యవధిలోనే నారాయణపేట పోలీసులు నిందితులను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది. అప్పటికే బాధితురాలు మంజుల దామరగిద్ద పోలీసులకు ఫిర్యాదు చేయగా, వెంటనే నారాయణపేట పోలీసులు దామరగిద్ద పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంజులను దామరగిద్ద పోలీసులు తీసుకువచ్చి బాలుడిని చూపించగా తన బాలుడేనని సత్యమ్మే తనను మభ్యపెట్టి బాలుడిని తీసుకెళ్లిందని పోలీసులకు తెలిపింది. వెంటనే నారాయణపేట డీఎస్పీ శ్రీ్ధర్ జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయానికి నిందితులను తీసుకువచ్చి కిడ్నాప్‌కు గురైన మూడునెలల బాలుడిని తిరిగి మంజులకు జిల్లా ఎస్పీ అనురాధ అప్పగించారు. రెండుగంటల వ్యవధిలో కిడ్నాప్ కేసును ఛేదించిన నారాయణపేట పోలీసులను తాను అభినందించి కానిస్టేబుళ్లు బాలరాజు, నరేష్‌గౌడ్, శ్రీరాములు, శ్రీకాంత్‌లకు ఎస్పీ రివార్డులను అందజేశారు. విలేఖరుల సమావేశంలో డిఎస్పీ శ్రీ్ధర్, సీఐ, ఎస్సై, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.