మహబూబ్‌నగర్

వేద మంత్రాలతో మారుమోగిన తపోవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్లరూరల్, ఆగస్టు 17: మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామ సమీపంలో గల లలితాంబికాతపోవనం శుక్రవారం వేద మంత్రాలతో మారుమోగింది. లలితాంబికాతపోవనం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో 108 హోమగుండాలలో నిర్వహించిన విజయవంతమైంది. హోమగుండాల వద్ద పెద్ద సంఖ్యలో దంపతులు కూర్చుని హోమాలు జరిపించారు. ముందుగా లలితాంబికా అమ్మవారికి తపోవన పీఠాధిపతి సర్వేశ్వరానందగిరి పూజలు నిర్వహించారు. అనంతరం గణపతి, కళశ పూజలు నిర్వహించి యజ్ఞం ప్రారంభించారు. యజ్ఞంలో కూర్చున్న దంపతుల చేత సర్వేశ్వరానందగిరి స్వామీ సహస్రనామ పారయణం జరిపించారు. వేడుకలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శే్వతాలక్ష్మారెడ్డి,ఎంపిపి లక్ష్మిశంకర్ నాయక్‌లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు,అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈసందర్బంగా స్వామీ సర్వేశ్వరానందగిరి స్వామి భక్తులనుద్దేశించి ప్రసంగించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ భారతీయ సనాతన సాంప్రాదాయలను అనుసరిస్తూ భక్తిని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉందని అన్నారు.
శ్రావణమాసం తొలి శుక్రవారం లోకకళ్యాణార్థం తపోవనంలో నిర్వహించిన శ్రీలలితా సహస్రనామ పారయణ సహిత శ్రీలలిత ఙ్ఞన యఙ్ఞం నిర్వహించడం ఎంతో శుభదాయకం అన్నారు. సాంప్రదాయాల్లోని భక్తి, ఆధ్యాత్మికత ద్వారానే సమాజంలో అసమానతలు తొలుగుతాయని ప్రతి ఒక్కరూ గుర్తించాలని స్వామీజీ సందేశం ఇచ్చారు. భక్తుల కోసం సామాన్య భక్తుల చేత నిర్వహించబడిన యజ్ఞం ద్వారా అసమానతలు తొలగిపోతాయని ఆయన పేర్కొన్నారు. వంద సంవత్సరాల క్రితమే సమాజంలోని అసమానతలు తొలగించేందుకు మళయాళ స్వామీ భక్తి భావాన్ని విస్తృతంగా ప్రచారం చేశారని స్వామీజీ తెలిపారు. తపోవనం వ్యవస్థాపకుడు రామేశ్వరానంద స్వామీజీ మళయాళ స్వామి చూపిన మార్గంలో నడిచి ఎందరికో మార్గ దర్శకుడు అయ్యాడని ఆయన గుర్తు చేశారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ యఙ్ఞ,యాగాలు నిర్వహించాలని,్భక్త్భివాన్ని పెంపొందించుకోవాలని, శాంతి స్థాపన కోసం పాటు పడాలని, భక్తి మార్గం ద్వారానే శాంతి స్థాపన సాధ్యమని ఆయన పేర్కొన్నారు.