మహబూబ్‌నగర్

బీమా కాల్వకు కోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్‌గల్, ఆగస్టు17: మండల పరిధిలోని కేతేపల్లి గ్రామంలో నాగులకుంట వద్ద బీమా కాల్వ కొత్తకు గురై మూడు రోజులు కావస్తున్నప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదని శుక్రవారం పలవురు రైతులు వాపోయారు. బీమా కాల్వ ఉదృత్తంగా ప్రవాహిస్తుండడంతో కాల్వ నుండి నాగులకుంటకు నీటిని విడుదల చేసేందుకు పైపులు వేయగా అట్టి పైపు వద్ద కొతకు గురైందని రైతులు తెలిపారు. దీంతో నాగులకుంట నీటితో నిండి అలుగు పారుతూ పంట పొలాల మీద సాగునీరు వృదాగా పోతుంని రైతులు తెలిపారు . అధికారులు వెంటనే కొతకు గురైన కాల్వకు మరమ్మత్తులు చేపట్టాలని రైతులు కొరుతున్నారు.
ఎమ్మెల్యేపై వ్యక్తిగతం విమర్శలు మానుకోవాలి
* ఐదేళ్లు దయాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి ఏమి చేశారు? * మార్కెట్ చైర్మన్ నర్సింహగౌడ్
మక్తల్, ఆగస్టు 17: ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డిపై ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని, ఐదేళ్లు తేదేపా ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి ఉండి మక్తల్ నియోజకవర్గానికి , ఈప్రాంత ప్రజలకు చేసింది ఏమిలేదని మార్కెట్ చైర్మన్ పి.నర్సింహగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు మహిపాల్‌రెడ్డిలు తీవ్రంగా మండి పడ్డారు. శుక్రవారం వారు ఎమ్మెల్యే అతిథి గృహంలో ఏర్పాటు చేసిన స్థానిక విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. వడ్వాట్ చెరువుకు నీటిని విడుదల చేయాలంటూ ప్రతి పక్ష నాయకులు చేసిన ధర్నా కార్యక్రమంలో ఎలాంటి పస లేదని అన్నారు. ముఖ్యంగా కుడికాలువ పెండింగ్ పనులను పూర్తిచేయాలని రాస్తారోకో చేయడంలో ముఖ్య పాత్రధారులు, సూత్రధారులు బీజేపీ నాయకులు కొండయ్య, కాంగ్రెస్ నాయకులు చిట్యాల నిజాంపాషాలేనని అన్నారు. వారిరువురు బినామి పేర్లతో కాంట్రాక్టర్ తీసుకోవడం, తీసుకున్న పనులను పెండింగ్‌లో పెట్టడం వంటివి జరుగడంతోటే నేడు పనులకు ఆటంకం కలుగుతుందని అన్నారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కిలు చేసినా పెండింగ్ పనులుకానీ, ప్రతి రైతు పొలానికి సాగునీటి విడుదల కానీ, నియోజకవర్గంలోని చెరువులనన్నింటిని నీటితో నింపి రైతులకు మరింత చేరువ కావడం జరుగుతుందని వారన్నారు. ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి తన వ్యక్తిగత శ్రద్ధతో నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందించాలన్న సంకల్పంతో ఉన్నారని తెలిపారు. ఇలాంటి విమర్శలు మళ్లీ పునరావృతం జరిగితే అదే తరహాలో తాము సైతం వ్యక్తిగత దాడులు చేయడానికి సిద్ధమని అన్నారు. ఇప్పటి వరకు మక్తల్ నియోజకవర్గంలో దాదాపు 70 చెరువు నింపడం జరిగిందని, మితగా చెరువులను సైతం త్వరలో నింపుతామని, మీకు దమ్ము ధైర్యం ఉంటే నింపిన చెరువులను పరిశీలించేందుకై రావాలని వారు సవాలు విసిరారు. సమావేశంలో మహేశ్వర్‌రెడ్డి, ఎల్లారెడ్డి, రవిశంకర్‌రెడ్డి, నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.