మహబూబ్‌నగర్

పాలమూరులో పాగా వేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అగస్టు 17: పాలామూరులో పాగా వేస్తామని రాబోయే ఎన్నికల్లో మాత్రం జిల్లాలో మంచి ఫలితాలను సాధిస్తామని టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని వివిధ వార్డులలో టీజేఎస్ జెండాలను ఆవిష్కరించారు. వివిధ వార్డులలో పలు పార్టీలకు చెందిన కార్యకర్తలను టీజేఎస్‌లో చేరారు. హబీబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన గాడితప్పిపోయిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత మూడేళ్ల క్రితం మహబూబ్‌నగర్ పట్టణంలోని మురికివాడల్లో పర్యటించారని ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలేదని ఆరోపించారు. పేదలందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పి ఉన్న ఇళ్లను కూల్చివేయించి తీరా వారికి ఇళ్లను ఇవ్వలేని అసమర్థత ప్రభుతాన్ని గద్దెదింపితేనే అంతా బాగా జరుగుతుందని అన్నారు. మరోసారి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ సీఎంగా అయితే ఇక రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని అంతా మాఫియాదే రాజ్యమేలుతుందని ఘాటైన విమర్శలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు ఎదురుగాలి వీస్తుందని దాంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో వణుకు మొదలైందని ఎధ్దేవా చేశారు. దీనిని గమించిన కొందరు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నాయకులను భయబ్రాంతుమలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పాలమూరులో మాత్రం తెలంగాణ జనసమితి తప్పకుండా పాగా వేస్తుందని ప్రజలు కోదండరామ్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో దాదాపు ఇప్పటికే 30 వార్డులలో బలమైన నాయకత్వం టీజేఎస్‌కు ఉందని వచ్చే ఎన్నికల్లో తాను తప్పకుండా మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని ఆయన వెల్లడించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి టీజేఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపడం జరుగుతుందని అందుకు ఇప్పటి నుండే తాము అంతా సిద్దం అవుతున్నామని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటస్వామి, బాల్‌కిషన్, నసీర్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.