మహబూబ్‌నగర్

ఎడతెరిపిలేని వానలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అగస్టు 17: జిల్లాలో గత రెండు మూడు రోజుల నుండి ముసురు పట్టి ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది. దాంతో జిల్లాలోని మట్టిరోడన్నీ చిత్తడిగా మారాయి. అంతేకాకుండా గత ఇరవై రోజులుగా వర్షం కోసం ఎదురు చుస్తున్న రైతులకు ఈ వాన ఊపిరి పోసిందని చెప్పవచ్చు. భారీ వర్షాల సంగతి దేవుడెరుగుగానీ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు ప్రాణం పోశాయని రైతులు చెబుతున్నారు. జిల్లాలోని హన్వాడ, మహబూబ్‌నగర్‌రూరల్, దేవరకద్ర, నవాబుపేట, రాజపూర్, జడ్చర్ల, మిడ్జిల్, తిమ్మాజిపేట, నాగర్‌కర్నూల్, వంగూర్, కల్వకుర్తి, కోస్గి, మద్దూర్ మండలాల్లో ఓ మోస్తారు వర్షం కురవగా, మిగతా మండలాల్లో ముసురు పట్టి వర్షం కురుస్తోంది. శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తూనే చల్లటి ఈదురుగాలు వీస్తున్నాయి. ఈ వర్షం ఖరీఫ్‌లో సాగు చేసిన వర్షాధార పంటలు అయిన కంది, మొక్కజొన్న, ఆముదం, జొన్న, పత్తి పంటలకు మాత్రం జీవంపోసిందని రైతులు బహిరంగంగానే చెబుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో వర్షాలులేకున్నా కృష్ణానది మాత్రం పరవళ్లు తొక్కుతుంది. జూరాల ప్రాజెక్టుకు నారీ వరద వస్తుండడంతో భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల మోటర్లను మళ్లీ ప్రారంభిం చారు. దాంతో జిల్లాలోని ప్రాజెక్టుల కాల్వల వెంట కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. శ్రీశైలం జలాశయంలోకి సైతం భారీ వరద నీరు వచ్చి చేరుతుండడంతో కల్వకుర్తి ఎత్తిపోతల మోటార్ రన్ చేశారు. దాంతో ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లలోకి కృష్ణానది నీరు వచ్చి చేరుతుంది. దాంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సంబంధించిన మోటార్లు వివిధ రిజర్వాయర్ల దగ్గర రన్ చేసి కల్వకుర్తి ఆయకట్టుకు సాగునీరు వదులుతున్నారు. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ పట్టణంలో చినుకులతో పాటు అప్పుడ ప్పడూ భారీ వర్షమే కురుస్తుడడంతో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. కొన్ని ప్రాంతాలలో రోడ్లు గుంతలుగా ఎర్పడిన పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఏమైనప్పటికీ ప్రస్తుతం ముసురు మాత్రం పంటలకు ప్రాణం పోసిందని రైతులు చెబుతున్నారు.

సుంకేసులకు వరద ఉద్ధృతి

శాంతినగర్, ఆగస్టు 17: తుంగభద్రనది ఉగ్రరూపం దాల్చటంతో రాజోలి శివారులోని సుంకేసుల జలాశయంలో వరద ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం ఎగువ నుండి 1,87,000క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి వచ్చి చేరుతుంది. వరదతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులు 20 సాధారణ గేట్లను, రెండు ఎమర్జెన్సీ గేట్లను ఎత్తి 1,84,000 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నట్టు డ్యాం అధికారులు తెలిపారు. వరద నీటి ప్రవాహంతో తిరుగు జలాలు పెరగటంతో రాజోలి గ్రామంలో పచ్చిమిరప, కంది పంటలు నీట మునిగాయి. అలాగే ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల వరకు నీరు రావడంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తుంగభద్రలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో నదీతీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.