క్రైమ్/లీగల్

ఆర్టీసీ బస్టాండ్‌లో ఇద్దరు దొంగల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ: కోదాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు నాలుగున్నర లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కోదాడ పట్టణ ఇన్‌స్పెక్టర్ యూ.శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో బుధవారం వివరాలను ఆయన విలేఖరులకు తెలియచేశారు. పట్టణ ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి కోదాడ బస్టాండ్‌లో చేస్తున్న ఆకస్మిక తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులు కినె్నర మధు, కూరాకుల రవి అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. బాలాజీనగర్, చిలుకూరు, కోదాడ రూరల్, మేళ్లచెర్వు పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో దొంగతనాలు చేసినట్లు అంగీకరించినట్లు చెప్పారు. దొంగిలించిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను వివిద ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టినట్లు గుర్తించి వాటిని రికవరీ చేసినట్లు ఆయన వివరించారు. నిందితుల వద్ద నుండి పదమూడున్నర తులాల బంగారం, పంది తులాల వెండిని తాకట్టు పెట్టిన కాగితాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. విలేఖరుల సమావేశంలో ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి, కానిస్టేబుళ్లు గోవిందు, నర్సింహరావు ఉన్నారు.