మహబూబ్‌నగర్

చేనేతకు చేయూతే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేటటౌన్, సెప్టెంబర్ 12: చేనేత రంగాన్ని ఆదుకోవడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే చేనేత కార్మికులు ఆధునిక పద్ధతుల్లో వస్త్రాలను తయారు చేసేలా శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ట్రెస్కో డైరక్టర్ శైలజా రామయ్యర్ అన్నారు. బుధవారం నారాయణపేట పట్టణంలోని ఆప్కో కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ట్రెస్కో డైరక్టర్ శైలజా రామయ్యర్, మున్సిపల్ చైర్‌పర్సన్ గందె అనసూయ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేనేత కార్మికుల్లోని నైపుణ్యాన్ని వెలికితీయడంతో పాటు ఆధునిక పద్ధతుల్లో స్వల్పకాలంలోనే చీరలను తయారు చేసేలా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దాంతో పాటు నూతన డిజైన్లను ఎలా వేయాలో ఈ శిక్షణలో నేర్పించనున్నట్లు తెలిపారు. నారాయణపేట చేనేత కార్మికుల జీవితంలో పూర్వవైభవం తీసుకురావాలన్న సదుద్దేశ్యంతో ప్రభుత్వం తరఫున చేనేత, జౌళిశాఖ తరఫున చేనేత సాంకేతిక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
చేనేత పరిశ్రమలో నారాయణపేట చీరకు నేటికీ ఆదరణ తగ్గలేదని, సరికొత్త డిజైన్లతో కొత్తగా చీరలను తయారు చేసి ఈ ప్రాంత పేరును నిలపాలన్నారు. చేనేత రాని వారికి నేత వస్త్రాలను మగ్గంపై ఏ విధంగా నేయాలి, పాత కార్మికులకు నూతన డిజైన్లతో పాటు నేటి తరానికి కావాల్సిన నైపుణ్యంతో చీరలను తయారు చేసేలా శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చీర్ల శ్రీనివాసులు, చేనేత కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించాలి
* జడ్పీటీసీ వాకిటి శ్రీహరి
మక్తల్, సెప్టెంబర్ 12: మక్తల్ గ్రామీణ స్థాయిలో చక్కటి ప్రతిభను కనబరచి రాష్ట్ర స్థాయి ఆటల్లో రాణించాలని జెడ్పీటీసీ వాకిటి శ్రీహరి, సభాధ్యక్షులు, ఎంఈఓ లక్ష్మీనారాయణ, స్కూల్ గేమ్స్ జోన్ సెక్రెటరీ పిడి వెంకటేష్‌లు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మక్తల్‌లోని మినీ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ అండర్ 14,17 సంవత్సరాల బాల బాలికలకు నిర్వహించిన టోర్నమెంట్, సెలెక్షన్ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా పాల్గొని మాట్లాడారు. గతంలో కూడా మక్తల్ ప్రాంత గ్రామీణ స్థాయి నుండి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు మన విద్యార్థులు క్రీడల్లో రాణించడం జరిగిందని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న మండల స్థాయి స్కూల్ గేమ్స్‌లో చక్కగా రాణించి జోన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మన మక్తల్ క్రీడాకారులు రాణించాలని తాము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు వారు చెప్పారు. అనంతరం జెడ్పి చైర్మన్ వాకిటి శ్రీహరి, ఎంఈఓ లక్ష్మీనారాయణ కబడ్డీ అడి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చంద్రకాంత్‌గౌడ్, గజిటెడ్ హెచ్‌ఎంలు అనీల్‌గౌడ్, పిఈటిలు జగదీష్, రూప, పరంజ్యోతి, మీనాకుమారి, విష్ణువర్ధన్‌రెడ్డి, అంబ్రేష్ తదితరులు పాల్గొన్నారు.