మహబూబ్‌నగర్

చేనేత కార్మికుల రుణమాఫీకై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరచింత, సెప్టెంబర్ 12: జాతీయ చేనేత అభివృద్ధి పథకం జౌళిశాఖ ఆధ్వర్యంలో 2013 లో చేనేత కార్మికులకు అందజేసిన ( క్రెడిట్ కార్డు ) రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని రుణాలను పొందిన వారిలో ఎవరైన అనర్హులు ఉన్నరేమో మరో సారి విచారణ చేయాలని రాష్ట్ర జౌళిశాఖ ఉన్నతాధికారులు ఆదేశించడంతో నాగర్‌కర్నూల్, జోగులంబ గద్వాల్, వనపర్తి జిల్లాలో చేనేత కార్మికుల రుణమాఫీ జాబితాపై విచారణ జరుపుతున్నమని జౌళిశాఖ ఏ డి చరణ్ తెలిపారు. బుధవారం ఆయన ఏ డి ఓ లు చరణ్, రాజేశ్వర్‌రెడ్డి లతో కలిసి అమరచింత ఆంధ్రాబ్యాంకు లో చేనేత కార్మికులు తీసుకున్న రుణమాఫీ జాబితా పై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు అవసరమైన రేషన్, నూలుతో పాటు వివిధ రకాల మూడి సరుకులను కొనుగోలు చేసేందుకు ఒక్కో కార్మికుడికి క్రెడిట్ కార్డు ద్వారా ముప్ఫై వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఎలాంటి షరతులు లేని రుణాలను అందజేసిందని తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2013 నుంచి 2017 వరకూ చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిద హమీ మేరకు రుణ మాఫీకి ఆదేశాలు రావడంతో రుణాలను పొందిన వారిలో ఎవరైన అనర్హులు ఉంటే వాటిపై ఈ నెల 30 వ తేదీ లోపు పునర్వివిచారణ నివేదిక అందజేయాలని ఉన్నతాథికారులు అదేశించడంతో విచారణ వేగవంతం చేశామని తెలిపారు. ఆయనతో పాటు అమరచింత చేనేత సహకార సంఘం అధ్యక్షుడు యం చంద్రమోహన్, కోశాధికారి రామాలింగం, చేనేత కార్మిక సంఘం నాయకులు పారుపల్లి సత్యన్న, సోములు ఉన్నారు.