మహబూబ్‌నగర్

చవితిని శాంతియుతంగా జరుపుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 12: వినాయకచవితి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం పట్టణంలోని విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో బ్రహ్మంగారి మఠంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పట్టణంలో 9రోజుల పాటు నిర్వహించనున్న గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో పూజించాలని అదేవిధంగా నిమజ్జనం కూడా చేయాలని కోరారు. ముఖ్యంగా గణేష్ మండపాల దగ్గర భక్తిపాటలను పెట్టాలని, సినిమా పాటలను పెట్టకూడదని ఆయన గణేష్ మండప సభ్యులకు సూచించారు. అనంతరం క్లక్‌టవర్‌లో మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలంటూ విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్, వైస్ చైర్మన్ రాములు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు మద్దియాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.