మహబూబ్‌నగర్

కేసీఆర్‌కు ఓట్లు అడిగే హక్కులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 12: గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చని కేసీఆర్‌కు ప్రజలను ఓటు అడిగే హక్కులేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగం జనార్ధన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఉదయం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో పార్టీ జెండాను ఆయన ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపలు, బర్లు, గొర్రెలు అంటూ ప్రచారం చేసుకున్నాడే కాని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పట్టించుకోలేదని విమర్శించారు. ఒకటి రెండు చోట్ల డబుల్ బెడ్‌రూంలను కట్టించి రాష్టవ్య్రాప్తంగా నిర్మించినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇంటింటికీ శుద్ధ జలాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చిన తరువాతే ఓట్లు అడుగుతానని చెప్పిన టీఆర్‌ఎస్ నేతలను గ్రామాలలోకి వచ్చినప్పుడు నిలదీయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులు, విద్యార్థులకు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, రైతులకు ఇలా అన్ని రంగాల వారికీ ఇచ్చిన హామీలను అమలుచేయలేదన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, అన్ని రంగాలను విస్మరించారని ఆరోపించారు. విద్య, వైద్య, సాగునీరు తదితర రంగాలను ఏమాత్రం పట్టించుకోలేదని, కాంగ్రెస్ హయాంలో చేపట్టిన 33 ప్రాజెక్టులను రీ డిజైనింగ్ పేరుతో అంచనాలు పెంచి దోచుకోవడం తప్ప మరొకటి లేదన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేసి పంట పొలాలకు నీరు ఇస్తున్నామని ప్రచారం చేసుకోవడం దారుణమని, చెరువులను నింపి చెరువు ఆయకట్టుకు నీరు ఇస్తున్నారే కాని, ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఆయకట్టుకు నీరు ఇవ్వడంలేదన్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో కేఎల్‌ఐ ద్వారా సాగునీరు ఇచ్చేందుకు అవసరమైన పిల్ల కాలువలను తవ్వి ఉంటే వర్షాభావ పరిస్థితులు నెలకొని ఈ సమయంలో రైతులకు ఎంతో ఉపయోగపడి ఉండేదన్నారు. పిల్ల కాలువలను తవ్వనందుకు వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అవలంభించిన విధానాలు, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకొని వెళతామన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాను కరవుప్రాంతంగా ప్రకటించి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కాశన్న, వెంకట్రాములు, సమద్‌పాషా, తిమ్మాజిపేట పాండు, వెంకటయ్యగౌడ్, అర్థంరవి, నసీర్ తదితరులు పాల్గొన్నారు.