మహబూబ్‌నగర్

అభివృద్ధి పరుగులు పెట్టిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోస్గి, సెప్టెంబర్ 12: ఆంధ్ర పాలకుల నిలువుదోపిడికి గురైన తెలంగాణ రాష్ట్రం ఎన్నో పోరాటాలతో సాధించుకున్నామని, సాధించుకున్న రాష్ట్రం ఎన్నో సమస్యల్లో కొట్టుమిట్టాడుతుండేదని ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ అభివృద్ధిలో దేశంలోని అన్ని రాష్ట్రాల చూపు తెలంగాణ వైపు చూసేంత అభివృద్ధి కేసీఆర్ చేశారని ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం కోస్గి పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం ఆయన మాట్లాడారు. తన మాటల గారడితో రేవంత్‌రెడ్డి కోడంగల్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమేనని, ఎప్పుడూ టీవీలల్లో, న్యూస్ పేపర్లలో తప్పా నియోజకవర్గ గ్రామాలల్లో పర్యటించి ప్రజల సమస్యల పరిష్కారానికి ఏనాడు కృషి చేసిన దాఖలాలు లేవని అన్నారు. కే సీ ఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో ఇరత రాష్ట్రాల ప్రజలు మా రాష్ట్రా సైతం తెలంగాణాలో వీలినం చేయాలని కోరుకుంటున్నారని, నిరుపేదల అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ పార్టీ రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తుందని, రైతుకు రూ. 5లక్షల రైతు భీమా పథకం అమలు చేస్తోందని దీంతో రైతులు బంగారు తెలంగాణ కల సాకారం అయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. అలాగే ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవ, అభివృద్ధిలో టీఆర్‌ఎస్ పార్టీ ఎల్లపుడూ ముందంజలో ఉంటుందని, మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇతర పార్టీ అయినా కోడంగల్ నియోజకవర్గానికి రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వచ్చే ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి ఎల్లప్పుడూ పిలిస్తే పలికే నేతగా మీ సేవలో కొనసాగుతానని ఆయన అన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ నాలుగున్నర సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి చేసి చూపిందని, మరోసారి టీఆర్‌ఎస్ పార్టీని ఆదరిస్తే బంగారు తెలంగాణ సాకారమవుతుందని, అలాగే నరేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, ఇందుకోసం నేను నియోజకవర్గంలోని ప్రతి ఇంటి గడపకు మొక్కలన్నా నేను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. అంతకు ముందు పట్టణంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సుమారు 200 ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలపార్టీ అధ్యక్షులు అన్నకిష్టప్ప, ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కృష్ణ, వైస్ ఎంపీపీ దోమరాజేశ్వర్, జడ్పీటీసీ అనితాబాల్‌రాజ్, నాయకులు హన్మంత్‌రెడ్డి, మ్యాకల రాజేష్, ఓంప్రకాష్, మాస్టర్ శ్రీనులతో పాటు పెద్ద ఎత్తున టీ ఆర్ ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.