మహబూబ్‌నగర్

కారుకు ప్రత్యామ్నాయం కమలమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 12: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ నేతృత్వంలోని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీల కూటమి ప్రత్యామ్నాయం కాదని, బీజేపీయే ప్రత్యామ్నాయమని బీజేపీ శాసనపక్షం అధ్యక్షులు కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని సీఎన్‌రెడ్డి సేవాసదన్‌లో జరిగిన బీజేపీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 26 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే సగానికిపైగా ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదిలి టీఆర్‌ఎస్‌లో చేరారని, బీజేపీ మద్దతుతో టీడీపీ అభ్యర్థులు 15 మంది ఎమ్మెల్యేలుగా గెలిస్తే ఒక్కరు తప్ప మిగతా వారు వెళ్లిపోయారని, సీపీఐ నుంచి ఒక్క అభ్యర్థి గెలిస్తే ఆయన కూడా ఆ పార్టీని వదిలాడని ఇలా పార్టీ ఎమ్మెల్యేలనే రక్షించుకోలేని ఈ పార్టీలు కలిసి ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ నుంచి ఐదుమంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన పార్టీని వదలకుండా అధికార పార్టీ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకొని పోవడం జరిగిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లకాలంలో అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతులకోసం వివిధ పథకాలను చేపట్టి విజయవంతంగా అమలుచేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, అధిక నిధులను కేటాయించడంతో తెలంగాణతో సహా దేశంలోని అనేక రాష్ట్రాలలో కోతలులేని విద్యుత్‌ను వ్యవసాయ రంగానికి ఇస్తున్నామన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాల ధరలను భారీగా తగ్గించి సకాలంలో అందించడంతోపాటు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రెండుశాతం ప్రీమియంతో సమగ్ర పంటల బీమా పథకాన్ని తేగా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్య, రవాణా, వ్యవసాయ తదితర రంగాలలో అధిక నిధులతో వివిధ పథకాలను రూపొందించి అమలుచేస్తుండగా, వాటికి గులాబి రంగువేసి తాము ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలను, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని పోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. ఈనెల 15న ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే బీజేపీ ఎన్నికల శంఖారావంను జాతీయ అధ్యక్షులు అమిత్‌షా ప్రారంభిస్తునందున జిల్లా నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నాగూరావునామోజీ, సుభాష్‌చందర్‌జీ, నరేందర్‌రావు, జిల్లా అధ్యక్షులు బుసిరెడ్డి సుబ్బారెడ్డి, నేతలు విష్ణు, రాము, బుడ్డన్న, రవీందర్‌రెడ్డి, మల్లేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.