మహబూబ్‌నగర్

ప్రజాసంక్షేమమే మా ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 17: మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూడాలని ప్రజాసంక్షేమమే ధ్యేయంగా తాను పనిచేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి పుస్తకాన్ని అవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు హామీలే తప్పా అభివృద్ధి ఏమీ చేయలేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వలసల జిల్లా అయిన పాలమూరు జిల్లాను హైదరాబాద్ తరహాలో తీర్చిదిద్దేందుకు తనవంతు సహయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎవరేన్ని కుట్రలు చేసిన అభివృద్ధిలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని గడిచిన నాలుగేళ్లలో నియోజకవర్గంలో రూ.3.876కోట్లకుపైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. జిల్లాల విభజన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా పూర్తిగా వలసల జిల్లాగా మారుతుందని లేనిపోని అపోహలు సృష్టించారని ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఒర్వలేక పోతున్నారని ఆయన విమర్శించారు. 70 ఏళ్లుగా తెలంగాణను పాలించి పక్కన కృష్ణానది పారుతున్న మహబూబ్‌నగర్‌లో 15రోజులకోసారి తాగునీరు వచ్చేదని ప్రస్తుతం మిషన్‌భగీరథ పథకం ద్వారా ప్రతిరోజు తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. గత నాలుగేళ్లుగా తాను ఏం సాధించానో ప్రజలకు తెలుసు అని ముఖ్యంగా మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మయూరిపార్కు, మినీట్యాంక్‌బండ్, మెడికల్ కాలేజ్, బైపాస్‌రోడ్డు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఐటీ పార్కు, డబుల్‌బెడ్‌రూంలు సాదించుకున్నామని మహబూబ్‌నగర్ పట్టణాన్ని మహానగరంగా చేయడమే కార్యదిశ నాలో ఉందని అన్నారు. కులమతలకు అతీతంగా అందరికి సహయపడాలని, అభివృద్ది చేయాలనే తపన నాలో ఎంతో ఉందని అన్నారు. పుకార్లను నమ్మోద్దని ప్రజలు నన్ను ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాధి మనోహర్‌రెడ్డి, నరసింహ్మరెడ్డి, కురుమయ్య, మద్దియాదిరెడ్డి, శ్యామెల్, గోపాల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
* జాతీయ జెండాను ఎగురవేసిన బీజేపీ నేతలు
* విలీన దినాన్ని జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు
* విద్రోహదినమంటూ వామపక్షాల ర్యాలీలు

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. సోమవారం బీజేపీ నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోగా ఆయా తహశీల్దార్ కార్యాలయాల దగ్గర జాతీయ జెండాను ఎగురవేసి విమోచన దినోత్సవంలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లోని బీజేపీ కార్యాలయం దగ్గర పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ జరపడం లేదని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపితీరుతామని వెల్లడించారు. కర్ణాటక, మహారాష్టల్రో సెప్టెంబర్ 17ను స్వాతంత్య్ర దినోత్సవంగా ఆయా రాష్ట్రాలు, ఆయా ప్రాంతాలు సంబరాలు జరుపుతారని తెలంగాణలో మాత్రం కేసీఆర్ మరో నైజాంలా వ్యవహరిస్తూ తెలంగాణ ఆమరవీరులను అవమానిస్తున్నారని ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనంచేయడం చాలా చారిత్రాత్మకమైన విషయం అన్నారు. మా భూములు మాకు కావాలి, భూమి కోరకు, భుక్తి కోరకు ఎన్నో పోరాటలు చేసిన పోరాటయోధులు స్వాతంత్య్ర భారతదేశంలో హైదరాబాద్ విలీనం కావాలని కోరుతున్నారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికిని తెలంగాణ విలీన దినోత్సవాన్ని కూడా జరపడం లేదని ఆరోపించారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విద్రోహదినాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో వామపక్ష పార్టీ అధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించి తెలంగాణకు విముక్తి కలిగిన రోజు ప్రజలకు ఎంతో మేలు జరిగిందని అయితే ప్రజలు కోరుకున్న విలీనం జరగలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసి నాయకుడు రాంచంద్రయ్య ఆరోపించాడు.సెప్టెంబర్ 17 విలీన దినోత్సవంగా టీఆర్‌ఎస్ నాయకులు జరుపుకున్నారు. తెలంగాణ ఆమర వీరుల స్థూపం దగ్గర మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ విద్యార్థులతో కలిసి నివాళ్లు అర్పించారు. ఎంతో మంది త్యాగాల స్పూర్తితో తెలంగాణను సాదించుకున్నామని తెలిపారు. జడ్చర్ల తహశీల్దార్ కార్యాలయంపై బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఎగురవేయడంతో వారిని పోలీసులు ఆరెస్టు చేశారు.