మహబూబ్‌నగర్

కాంగ్రెస్ ఆట మొదలు పెట్టింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 18: కాంగ్రెస్ ఆట మొదలైందని, రాష్ట్రంలో గడీల పాలనును అంతమొందించడానికి తెలంగాణ సమాజం సిద్దమయ్యారని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్దమయ్యారని టీపీపీసీ కార్యదర్శులు సురేందర్‌రెడ్డి, ఎన్‌పి వెంకటేష్. వినోద్‌కుమార్‌లు అన్నారు. మంగళ వారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన పీసీసీ కార్యదర్శులు ఎన్‌పి వెంకటేష్, సురేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్‌లను మహబూబ్‌నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌యాదవ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనితారెడ్డిలతో పాటు వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పీసీసీ నేతలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన సభలో టీపీసీసీ కార్యదర్శి సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మంచి గాలి వీస్తుందని అందుకుగాను నాయకులు, కార్యకర్తలు తమ దూకుడును పెంచాలని పిలుపునిచ్చారు. విద్యార్థులను, యువతను నట్టేట ముంచిన టీఆర్‌ఎస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. నాలుగేళ్లుగా అరాచాకాలు, దౌర్జన్యాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంగతిని అంతా బయటపెడతామని హెచ్చరించారు. వారి దౌర్జాన్యాలను ప్రజల ముందు ఉంచి ఎన్నికల్లో ఓడించేలా తమ ప్రణాళికలు ఉండబోతున్నాయని తెలిపారు. ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే చిట్టా అంతా తన దగ్గర ఉందని ఆయన అనుచరులు చేసిన దందాల విషయాలన్ని తమ చేతుల్లో ఉన్నాయని సమయం వచ్చినప్పుడు ప్రజల ముందు ఉంచుతామని ఆయన వెల్లడించారు. పీసీసీ కార్యదర్శి ఎన్‌పి వెంకటేష్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అరాచక పాలన ముగిసిపోతుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చేసిన దౌర్జన్యాలు ఇంకా ప్రజలు మరిచిపోలేదని ఆరోపించారు. తమపై నమ్మకం ఉంచి పార్టీ రాష్ట్ర స్థాయి పదవులు ఇవ్వడం తమను ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు జిల్లా నేతలు ఎంతో గౌరవించారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే ప్రధాన ఎజెండా అని అన్నారు. పీసీసీ కార్యదర్శి వినోద్‌కుమార్ మాట్లాడుతూ తాను గత ముప్పై ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పని చేస్తున్నానని తనకు రాష్ట్ర పీసీసీలో పదవి దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించడంమే ద్యేయంగా ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్తలు పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌ను గెలిపించుకునే బాధ్యత ఉందని అన్నారు. కేసీఆర్ గడీల పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా యువత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వారి ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లించుకునేందుకు గ్రామాల వారిగా ప్రణాళికలు రచించుకుంటే మంచి ఫలితాలు రానున్నాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని ఎవ్వరు ఆపలేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కట్టా రవికిషన్‌రెడ్డి, అనంతరెడ్డి, ఫకీర్ అహ్మద్, ఆంజనేయులు, లక్ష్మణ్, బుచ్చయ్య, సమ్మద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

బాచారం రైతులకు సాగు నీరందిస్తా..
* పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి
పెద్దకొత్తపల్లి, సెప్టెంబర్ 18: కేఎల్‌ఐ అసంపూర్తి కాలువలను రెండు రోజులలో పూర్తి చేసి బాచారం, పెద్దకొత్తపల్లి గ్రామ రైతులకు సాగు నీరందిస్తానని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అసంపూర్తిగా ఉన్న కేఎల్‌ఐ కాలువలను ఆయన పరిశీలించారు. తన సొంత ఖర్చుతో నేటి నుండి రెండు రోజులలో రెండు జేసీబీలు, టిప్పర్లు ఏర్పాటు చేసి కాలువ పనులను ప్రారంభించే విధంగా జడ్పీటీసీ వెంకటయ్యకు మంత్రి జూపల్లి సూచించారు. పొలాలలో కాలువలు తీసేందుకు రైతులు పూర్తి స్థాయిలో సహకరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు.

చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలి
* ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి గీత
నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 18: ఆవనిలో సగం ఉన్న మహిళలకు అవకాశాల్లో సగం ఇవ్వడంలేదని, అందుకే చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కందికొండ గీత నేడొక ప్రకటనలో డిమాండ్ చేశారు. బిజెపి, కాంగ్రెస్‌లకు చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై చిత్తశుద్దిలేదని, ఏళ్లతరబడి నాన్చుతున్నారని విమర్శించారు. బిజెపి అధికారంలోకి వస్తే వంద రోజులలో మహిళా బిల్లును తెస్తామని హామి ఇచ్చిన నరేంద్రమోదీ నాలుగున్నర ఏళ్లు కావస్తున్నా దాని గురించే ప్రస్తావించడంలేదన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో మహిళలపై దాడులు పెరిగాయని, అరికట్టే మార్గాలు కనీసం చేపట్టడంలేదన్నారు. రాష్ట్రంలో కనీసం మహిళా మంత్రిలేకుండానే కేసిఆర్ పరిపాలన కొనసాగిస్తున్నాడని, మహిళలంటే కేసిఆర్‌కు చిన్నచూపన్నారు. రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, షీ టీంలను సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేసిఆర్ మద్యాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడని, దీనితో మహిళలపై దాడులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఇప్పుడున్నా మద్యం చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. గతంలో చౌకధర దుకాణాలలో 9 రకాల వస్తువులను ఇచ్చేవారని, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత బియ్యంకే పరిమితం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో పేదలను దృష్టిలో పెట్టుకొని 14రకాల నిత్యవసర సరుకులను అందచేయాలని డిమాండ్ చేశారు. మహిళలను చైతన్యపర్చేందుకు, వారి సమస్యలపై ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు.