మహబూబ్‌నగర్

బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, సెప్టెంబర్ 19: బంగారు తెలంగాణ రాష్ట్ర అపదర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతోనే సాధ్యమని, రాష్ట్భ్రావృద్ధికి కాంగ్రెస్ పార్టీనే కారణమని, కూటమి అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని మార్చల గ్రామంలో కల్వకుర్తి టీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారానికి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినసమావేశంలో వివిధ పార్టీలకు చెందిన గ్రామ యుకువకులు మంత్రి జూపల్లి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి నిరోదకులు కాంగ్రెస్ పార్టీ నాయకులేనని, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్యాయానికి గురి అయిందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే కారును గెలిపిస్తుందని మంత్రి అన్నారు. కల్వకుర్తిలో కారు దూసుకపోవడం ఖాయమని మంత్రి దీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహాకూటమి అభ్యర్థులకు డిపాజిట్లు రావని, వారు దోచుకోవడానికే గుంపుగా మారారని మంత్రి విమర్శించారు. ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యడ్మ కిష్టారెడ్డి, మాజీ టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్చి బాలాజీసింగ్, నాయకులు యడ్మ సత్యం, అల్వాల్‌రెడ్డి, విష్ణు, బాలయ్య, కృష్ణయ్య, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

కేఎల్‌ఐ కాలువను పరిశీలించిన జూపల్లి
పెద్దకొత్తపల్లి, సెప్టెంబర్ 19: మండల పరిధిలోని బాచారం స్టేజీ సమీపంలోని కేఎల్‌ఐ కాలువను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన రైతులతో మంత్రి మాట్లాడుతూ కాలువకు ఇరువైపుల ఉన్న రైతులు కాలువలను తవ్వించేందుకు అంగీకరిస్తే వెంటనే కాలువ పనులను చేపట్టేవిధంగా చర్యలు తీసుకుంటానని చెప్పగా, అందుకు వారు అంగీకరించారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, రైతుబంధు, రైతుబీమా పథకాలతోపాటు 24 గంటలు ఉచిత కరెంటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, సకాలంలో ఎరువులు, విత్తనాలను అందించడం తదితర వాటిని అమలుచేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట జడ్పీటీసీ వెంకటయ్య, నాయకులు నర్సింహ్మా తదితరులు ఉన్నారు.

కేసులు వేసి ప్రాజెక్టులు అడ్డుకున్న వారితో జాగ్రత్త
* మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి
దేవరకద్ర సెప్టెంబర్ 19: కోర్టులో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకూనే కాంగ్రేస్, టీడీపీ వారితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని దేవరకద్ర తాజా, మాజి ఎమ్మెల్యే అల వేంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈశ్వర వీరప్పయ్యస్వామి అలయంలో పూజలు చేసి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.