మహబూబ్‌నగర్

టీఆర్‌ఎస్‌ను బొందపెడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, సెప్టెంబర్ 19: రజాకారుల పాలనను తలపిస్తూ తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తూ.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను విస్మరించిన తెరాస ప్రభుత్వాన్ని, గులాబీ జెండాను బొందపెడదామని తెలంగాణ పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, గద్వాల తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గట్టు మండలం, బొయలగుడ్డెం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ఆమె ప్రారంభించారు. గ్రామంలోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పెద్దసంఖ్యలో గ్రామస్తులు, కాంగ్రెస్‌పార్టీ అభిమానులు తరలివచ్చి ఆహ్వానం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం పేరట గద్దెనెక్కిన కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపించారు. మిషన్‌భగీరథ పేరట పర్సంటేజీలు దండుకున్న తెరాస ప్రభుత్వం ముందస్తు ఎన్నికల్లో డబ్బులను ఎరచూపి లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ముఖ్యమంగా దళిత వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేసిందని, దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూ పంపిణీ, ఎస్సీ వర్గీకరణ, దళిత నాయకులపై అక్రమ కేసులు వంటి ప్రజావ్యతిరేక విధానాలను ఆమె అంటగట్టారు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ రాబందుల్లా తెలంగాణను దోచుకుతిన్నారని వాపోయారు. రుణమాఫీ, నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాలు, డబుల్ బెడ్‌రూం,పైవేటు ఉద్యోగుల క్రమబద్దీకరణ, ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్‌సీ, ఐఆర్ ఇవ్వకుండా ఆ వర్గాలపై కక్షసాదింపు చర్యలకు దిగిందన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రస్తుతం పారుతున్న సాగునీరు కాంగ్రెస్ పార్టీ పుణ్యమేనని, ఈ విషయాన్ని ఏ ఒక్క రైతు కాదనగలరా అన్ని ప్రశ్నించారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంతో పాటు గ్రామగ్రామానికి బీటీరోడ్డు, పాఠశాలల, కళాశాలల ఏర్పాటు, పాలిటెక్నిక్, జూరాల జల విద్యుత్ కేంద్రం, సబ్‌స్టేషన్ల ఏర్పాటు, ఇందిరమ్మ ఇండ్లు, అర్హులకు పింఛన్లు, ఆరోగ్యశ్రీ, ఉచిత రేషన్‌కార్డులువంటి ఎన్నో ప్రజాసంక్షేమ పథకాలను నిరుపేదలందరికి అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, డబుల్‌బెడ్‌రూం నిర్మాణాలకు నేరుగా లబ్దిదారునికి రూ.5లక్షలు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణం, లక్ష రివాల్వింగ్ ఫండ్, వృద్దులకు రూ.2వేలు, వికలాంగులకు రూ.3వేలు అందిస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేంత వరకు రూ.3వేల భృతి, ప్రభుత్వ ఖాళీల భర్తీ, నోటిఫికేషన్లు, ప్రైవేటు ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లతో పాటు ఐదు ఉచిత సిలిండర్లు, ఏడు కిలోల సన్నబియ్యంతో పాటు అనేక సంక్షేమ పథకాలను అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు గడ్డంకృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్‌రెడ్డి, నందినె్న ప్రకాష్‌రావు, బండల పద్మావతి, నాగేంధర్‌రెడ్డి, విక్రంసింహారెడ్డి, మాణిక్యారెడ్డి, రామాంజనేయులు తదితరులు ఉన్నారు.

అవకాశం ఇవ్వండి ... అభివృద్ధి చేసి చూపిస్తా..
* మాజీ ఎమ్మెల్యే మల్లు రవి
బాలానగర్, సెప్టెంబర్ 19: రాబోయే ఎన్నికల్లో తమ కు అవకాశం ఇచ్చి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మల్లురవి అన్నారు. బుధవారం బాలానగర్ మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు అయిన బిల్లింగ్‌తాండలో కాంగ్రెస్ పార్టీ జెండాను అవిష్కరించిన అనంతరం మాట్లాడా రు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజలు విసుగు చెందారని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాలను కార్యకర్తలు ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హాదిరమణారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపినాయక్, మాజీ సర్పంచ్ మురళీధర్‌రెడ్డి, నరసింహ్మరెడ్డి, శంకర్‌నాయక్, బిచ్యూనాయక్, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.