మహబూబ్‌నగర్

ముగిసిన రాష్ట్ర స్థాయి బీచ్ వాలీబాల్ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల రూరల్, సెప్టెంబర్ 20: మండల పరిధిలోని కోడ్గల్ గ్రామ సమీపంలోగల దుందుబి వాగులో గత మూడు రోజులుగా స్కూల్‌గేమ్స్ ఫేడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీచ్ వాలీబాల్ పోటీలు గురువారం ముగిశాయి. ఫైనల్ పోటీలు రసవత్తరంగా కొనసాగాయి.మూడు విభాగాల్లో బాల,బాలికలకు కొనసాగిన ఈ పోటీలలో రంగారెడ్డి, మహాబూబ్‌నగర్,నిజామాబాద్ జట్లు తమ ప్రతిభను కనబరిచాయి. బాలుర అండర్ 19 విభాగంలో రంగారెడ్డి, 17 విభాగంలో మహాబూబ్‌నగర్,14 విభాగంలో నిజామాబాద్ జట్లు గెలుపొందాయి. బాలికల అండర్ 19 విభాగంలో రంగారెడ్డి,17 విభాగంలో మహాబూబ్‌నగర్, 14విభాగంలో రంగారెడ్డి జిల్లాల జట్లు విజయం సాధించాయి. విజేతలకు ఎంపీపీ లక్ష్మి,కో ఆప్షన్ సభ్యుడు ఇమ్మూ,టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కోడ్గల్ యాదయ్య, పిఈటీలు తదితరులు పాల్గొన్నారు.

పగిలిన మిషన్ భగీరథ పైపులు
* ఇబ్బందులు పడ్డ వాహనచోదకులు
మానవపాడు, సెప్టెంబర్ 20: పగిలిన మిషన్ భగీరథ పైపులతో ఇబ్బందులు పడ్డా సంఘటన గురువారం ఉండవెల్లి మండల పరిధిలోని బొంకూరు లో చోటుచేసుకుంది. భగీరధ మెయిన్ లైన్‌కు సిమెంటు దిమ్మెలలో జేసీబీ వినియోగిస్తుండగా పొరపాటున పైపులైనుకు తగలటంతో వాల్వ్ దెబ్బతిని నీరు ఉవ్వెతున్న ఎగిసి పడింది. పైపులైను ప్రధాన రహదారికి పక్కనే ఉండటంతో వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు. దాదాపు40 అడుగుల మేర నీరు చిమ్మింది. గ్రామస్తులు దీన్ని చూసి భయాందోళనకు గురయ్యారు.

టీఆర్‌ఎస్ వెంటే ప్రజలు
* వందల సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరిక
* విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం
* మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
కోయిలకొండ, సెప్టెంబర్ 20: నారాయణపేట నియోజక వర్గంలోని ప్రతీ గ్రామంలో ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీ వెంటే ఉన్నారని ,రాబోయో ఎన్నికల్లో 30 వేలకు తగ్గకుండా మెజారీటీతో గేలుపు ఖాయమని నారాయణపేట తాజామాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని శేరివెంకటాపూర్ గ్రామంలో మండల టిఆర్‌ఎస్ పార్టీ విసృత స్తాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మండలంలోని 45 గ్రామాలకు చేందిన వివిద పార్టీల వందల సంఖ్యలో నాయకులు మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గలో నాలుగు సంవత్సరాల కాలంలో40 ఎళ్లలో జరుగని అభివృద్ది చేయడం జరిగిందన్నారు. ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని అభివృద్దే లక్షంగా నాలుగేళ్లుగా పని చేయడం జరుగుతుందన్నారు. రాబోయో ఎన్నికల్లో 30 వేలకు తగ్గని మెజారీటీ నియోజకవవర్గ ప్రజలు ఇవ్వడం జరుగుతుందన్నారు. టిఆర్‌ఎస్ తాండలనుగ్రామపంచాయితీలుగా మారుస్తూ గిరిజనుల అభివృద్దికి శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలో ఎక్కడా లేని విదంగా నియోజక వర్గలోని ప్రతీ గ్రామానికి తారురొడ్డురు మంజూరు చేయించి దాదాపు అన్ని గ్రామాలకు రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. మండల కేంద్రం నుండి కోయిలకొండ వరకూ బిటి రోడ్డు, జూనియర్ కళాశాల నిర్మాణం, మండలానికి గురుకుల ఆశ్రమ పాఠశాల మంజూరు, మిషన్ భగీరథ ద్వారా మండలంలోని అన్ని గ్రామాలు,గిరిజన తాండలకు తాగునీరు అందిస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో పైప్‌లైన్ పనులు ప్రారంభం అయ్యాయని రాబోయో కొద్ది రోజుల్లో ఇంటింటికి కొత్త పైపులు వైయడం జరుగుతుందన్నారు. కోయిలకొండ రూ.6కోట్లతో సివిల్ ఆసుపత్రి నిర్మాణం జరుగుంతుందని మరో రెండు మాసాల్లో ప్రారంభం అవుతుందన్నారు. కోయిలకొండ మండలంలో కాంగ్రేస్ నాయకులు వచ్చి అభివృద్ది గురించి మాట్లాడితే హస్యాస్పదంగా ఉంటుందన్నారు. ప్రజలు కాంగ్రేస్ పార్టీ నాయకులకు గ్రామాల్లో బుద్ది చెప్పాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణయ్య, కరుణాకర్‌రెడ్డి, విజయ భాస్కర్‌రెడ్డి, మల్లయ్య, మాధవులు, వివిద గ్రామాల మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పొంగిపొర్లిన బొంకూరు వాగు
* నిలిచిపోయిన అంతరాష్ట్ర రహదారి
* చెన్నిపాడు, పోతులపాడు వాగులతో ప్రజల ఇబ్బందులు
మానవపాడు, సెప్టెంబర్ 20: మానవపాడు, ఉండవెల్లి మండల పరిధిలో కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు బొంకూరు వాగు పొంగి పొర్లింది. దీంతో అంతరాష్ట్ర రహదారిపై రాకపోకలు ఆగిపోయాయి. బుధవారం రాత్రి నుంచి బొంకూరు వాగుపై రాకపోకలు నిలిచిపోయాయి.దీంతో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు రాత్రి భోజనాలు దొరకక ఇబ్బందులు పడ్డారు. వాహన చోదకులు వాగు ఉద్ధృతి తగ్గితే ముందుకు సాగాలని ఆలోచించినా ఉదయం వరకు వాగు ఉద్ధృతి తగ్గలేదు. ఉదయం ఏడు గంటలకు అధికారులు దారిని పునరుద్దరించటంతో రాకపోకలు యథావిధిగా సాగాయి. మానవపాడు మండల పరిధిలోని చెన్నిపాడు, పోతులపాడు వాగులు పొంగి పొర్లటంతో మానవపాడు గ్రామస్తులు, అమరవాయి,నారాయణపురం గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు.వాగులు దాటేందుకు ప్రయత్నించి ద్విచక్రవాహనదారులు వాగులో దాటే ప్రయత్నంలో ద్విచక్రవాహానాలు వాగు ఉదృతికి కొట్టుకుపోగా చోదకులు అష్టకష్టాలు పడి ఒడ్డుకు చేరుకున్నారు. రాత్రి వరుణుడు కరిణించటంతో ఉదయానికి వాగులు వంకలు శాంతించాయి. దీంతో రాకపోకలు సజావుగా సాగాయి. ఉండవెల్లి మండల పరిధిలో కురిసిన భారీ వర్షాలకు దాదాపు100 ఎకరాలకు పైగా పత్తి, ఉల్లి పంటలు నీట మునిగాయి. నీట మునిగిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.