మహబూబ్‌నగర్

పకడ్బందీగా ఈవీఎంల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 20: రాబోయే ఎన్నికలకు నూతనంగా ప్రవేశపెట్టబడుతున్న ఓటర్ వెరిఫయబుల్ పేపర్ అడిట్ ట్రయల్ (వివిపి ఎటి)లతో సహా బ్యాలెట్ యూనిట్లను, కంట్రోల్ యూనిట్లను ఫస్ట్‌లెవల్ చెక్ చేస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి రోనాల్డ్‌రోస్ తెలిపారు. గురువారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పోలిటికల్ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ మాట్లాడుతూ రాబోయే శాసనసభ ఎన్నికలకు అవసరమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను సిద్ధంగా ఉన్నాయని అన్నరు. వాటిని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నేటి నుండి పదిరోజుల పాటు ఫస్ట్ లెవల్ చెక్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ యూనిట్లు, వివిపిఎటిలు పూర్తిగా శుభ్రం చేసి సీల్ వేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధులు ధ్రువీకరించాల్సి ఉంటుందని తెలిపారు. పరీక్షించడం పూర్తి అయిన పిదప సీల్ చేసిన మిషన్‌లపై అదనపు ప్రధాన ఎన్నికల అధికారి, ఉప ప్రధాన ఎన్నికల అధికారి సంతకంతో సీల్ చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ర్యాండమ్ మాక్ పోల్ నిర్వహించడం జరుగుతుందన్నారు. గత ఎన్నికలలో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ మాత్రమే ఉండేవని అన్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కొత్తగా ఓటర్ వెరిఫయబుల్ పేపర్ అడిట్ ట్రయల్ పరికరాన్ని అదనంగా ఓటింగ్ ప్రక్రియలో ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. దీని వల్ల ఓటరు తాను వేసిన ప్రతినిధికే ఓటు జమ అయిన విషయాన్న ధ్రువీకరించుకోవచ్చని, ఓటు వేసిన వెంటనే వివిపిఎటిలోని డిస్‌ప్లేలో తాను ఓటువేసిన ప్రతినిధి గుర్తు ఏడు సెకండ్లు పాటు డిస్‌ప్లే అవుతుందని, దీనివల్ల మరింత భద్రత, కచ్ఛితత్వం పెరుగుతుందని అన్నారు. ఈ ప్రక్రియనంతా వీడియో రికార్డింగ్, సీసీటివిల ద్వారా రికార్డు చేయడం జరుగుతుందని తెలిపారు. ఫస్ట్ లెవల్ చెకింగ్ జరిగే ప్రాంతానికి పార్టీల ప్రతినిధులు సంబంధిత అధికారులు తప్ప ఎవ్వరిని అనుమతించడం జరగదని అన్నారు. సెల్‌ఫోన్‌లు అనుమతించడం జరగదని అన్నారు. మాక్‌పోల్‌ను డమ్మి గుర్తులతో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రావ్, డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రతినిధులు, పోలిటికల్ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలవండి
* విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో గణనీయమైన అభివృద్ధి
* మంత్రి లక్ష్మారెడ్డి
జడ్చర్ల, సెప్టెంబర్ 20: టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం అత్యంత త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని ఆపద్ధర్మ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం జడ్చర్ల పట్టణంలోని చంద్రాగార్డెన్స్‌లో నిర్వహించిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, రెషన్ డీలర్ల కమీషన్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పుట్టిన బిడ్డ నుండి మొదలుకొని మరణించిన వ్యక్తి వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఎకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. గత నాలుగున్నర సంవత్సరాలలో కనివిని ఎరుగని రీతిలో రాష్ట్రం అబివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. విధ్యా,వైద్య,ఆరోగ్య రంగాలల్లో గణనీయమైన అబివృద్ధి జరిగిందని, ముఖ్యమంత్రి కెసీఆర్ తనకు వైద్య,ఆరోగ్య శాఖను కేటాయించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే అవకాశం కల్పించినందుకు ఆయనకు ఎంతో ఋణపడి ఉన్నానని అన్నారు. వైద్య,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పుట్టిన పిల్లలకు రూ.12వేలు ఆర్థిక సహాయం అందించడంతో పాటు కెసీఆర్ కిట్‌ను అందించి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. బీదలకు కంటివెలుగు కార్యక్రమం ద్వారా కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించడమేకాక అవసరమైన వారికి కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తూ వారి ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ఇవ్వని హామీలను సైతం ఎన్నింటినో ముఖ్యమంత్రి నెరవేర్చారని ఆయన తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు,మిషన్ కాకతీయ ద్వారా చెఱువుల పునరుద్దరణ పనులు చేపట్టడంతో పాటు రైతులకోసం రైతు భీమా,రైతు బందు పథకాలను ప్రవేశ పెట్టి రైతుపక్షపాత ప్రభుత్వంగా తమ ప్రభుత్వం రైతుల హృదయాల్లో నిలిచిందని అన్నారు . గతంలో ఆడపిల్లల వివాహాలు చేయాలంటే వారి తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడేవారని, ముఖ్యమంత్రి కెసీఆర్ కళ్యాణలక్ష్మి,షాదిముబారక్ పథకాలను అమలు చేసి రూ.50వేల నుండి రూ.1లక్ష16వేలకు ఆర్థిక సహాయాన్ని పెంచారని ఆయన తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయంతో నిరుపేద ఇళ్లలో ఆడపిల్లల వివాహాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ పథకం అమలులో భాగంగా జడ్చర్ల నియోజకవర్గంలోనే రూ.25కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరగిందని ఆయన వివరించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు చురుకుగా కొనసాగుతున్నాయని, ఈపథకం పనులు పూర్తి అయితే పాలమూరు జిల్లా సస్యశ్యామలం అవుతువందని ఆయన అన్నారు. చాలిచాలని కమీషన్‌తో ఇబ్బందిపడుతున్న రేషన్ డీలర్ల కమీషన్‌ను నలబై పైసల నుండి డెబ్బై పైసలకు పెంచి వారి అబివృద్ధికి చేయూత ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం పాటుపడుతుందని, ఎన్నికల సమయంలో కళ్లబొల్లి కబుర్లు చెప్పె ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని పని చేసే ప్రభుత్వాన్ని గుర్తించాలని, ఆప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో ఎంపిపి లక్ష్మి,మార్కెట్ కమిటీ చైర్మన్ పిట్టల మురళి, వైస్‌ఎంపిపి రాములు, కోఆప్షన్ సభ్యుడు ఇమ్మూ, డీల ల సంఘం నాయకులు శ్రీనివాసులు,నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.