మహబూబ్‌నగర్

తెరాసలో అంతర్గత విభేదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 20: ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావించి అసెంబ్లీని రద్దు చేసి ఏకంగా అభ్యర్థులను ప్రకటించి అన్ని పార్టీల కన్నా తాము ముందున్నామని భావించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు పలు నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ ప్రజకటించిన అభ్యర్థుల విషయంలో పలు నియోజకవర్గాల్లో బహిరంగంగానే కుమ్ములాటలు కనబడుతున్నాయి. జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, అలంపూర్ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే అబ్రహం, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గానికి తాజా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, గద్వాల నియోజకవర్గానికి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిల పేర్లను కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో తెరాస అభ్యర్థులుగా ఖరారు చేశారు. అయితే పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గంలో తెరాస నాయకులు జలేందర్‌రెడ్డి, ఆశిరెడ్డితో పాటు పలువురు నాయకులు ఏకంగా ఆత్మగౌరవ సభలంటూ నిరసనకు దిగారు. మక్తల్ టికెట్‌ను తాజా మాజీ ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డికి ఇవ్వవద్దంటూ ఆయన అభ్యర్థిత్వాన్ని మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దాంతో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి రంగంలోకి చిట్టెం రాంమోహన్‌రెడ్డికి అండగా నిలిచారు. అయిన్నప్పటికీ అసమ్మతి రాజుకుంటూనే ఉంది. మక్తల్‌లో జరుగుతున్న పరిణామాలను మంత్రి లక్ష్మారెడ్డి కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లిన్నట్లు సమాచారం. వెంటనే సమస్యను పరిష్కరించి రాంమోహన్‌రెడ్డికి అందరు మద్దతుగా ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా కేటీఆర్ మంత్రి లక్ష్మారెడ్డికి సూచించిన్నట్లు తెలుస్తుంది. అయితే రాంమోహన్‌రెడ్డి మాత్రం వీరు తనకు ఎప్పటికీ సహకరించరనే ఉద్దేశ్యంతో గత నాలుగైదు నెలల నుండే వారిని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారని రాంమోహన్‌రెడ్డి అనుచరులు చర్చించుకుంటన్నారు. మక్తల్ సమస్య ఇలా ఉంటే అలంపూర్‌లో సైతం మాజీ ఎంపీ జగన్నాథం అనుచర వర్గం గుస్సాగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే అబ్రహం అభ్యర్థిత్వాన్ని మంద జగన్నాథం అనుచరులు ఒప్పుకోవడం లేదు. తెలంగాణ ఉద్యమంలో, పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం సమయంలో మంద జగన్నాథం చూపించిన చొరవను కేసీఆర్ గుర్తించకపోవడం బాధాకరమని నియోజకవర్గంలో తెరాస నేతలు చర్చించుకోవడం గమనార్హం. గత 2014 ఎన్నికల్లో మంద జగన్నాథం తనయుడు మంద శ్రీనాథ్‌కు టికెట్ కేటాయించగా అప్పట్లో ఓటమి చెందారు. అయితే రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఓటమి చెందిన వారికి టికెట్లు ఇచ్చారని అలంపూర్ నియోజకవర్గం అభ్యర్థి విషయంలో కేసీఆర్ ఇలా చేయడం ఎంతవరకు సబబు అని మంద జగన్నాథం వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. ఇలా ఈ నియోజకవర్గంలో అసమ్మతి సెగలు కనబడుతున్నాయి. కల్వకుర్తి నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ తెరాసలో రెండు మూడు గ్రూపులు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గం సైతం నియోజకవర్గంలో ఉంది. అయితే పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం గత 2014 ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా నిలబడి ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కే ప్రాధాన్యతను ఇస్తూ వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి అభ్యర్థిగా పేరును ఖరారు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బహిరంగంగా వ్యతిరేకించిన్నప్పటికిని ఆయన అనుచర వర్గం మాత్రంలోలోపల తమ నేతకు టికెట్ ఇవ్వకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు భవిష్యత్‌లో ఎలా ఉంటాయోనని కసిరెడ్డి వర్గీయులు మాత్రం జైపాల్‌యాదవ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కొందరు నాయకులు, వివిధ గ్రామాల్లో తెరాస కార్యకర్తలు దూరంగానే ఉన్నారు. కాగా ఇక్కడ రాజకీయ చైతన్యం బాగా ఉండడంతో నియోజకవర్గంలో ఎన్నికల నాటికి పరిస్థితులు మాత్రం చాలా విచిత్రంగా జరుగుతాయని కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గీయులు మాత్రం చర్చించుకోవడం గమనార్హం. గద్వాలలో విచిత్రమైన పరిస్థితులు తెరాసలో నెలకొన్నాయి. తెరాస అభ్యర్థిగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కేసీఆర్ ఖరారు చేశారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి డికె అరుణను ఢికొట్టాలంటే తెరాస నేతలంతా ఒకతాటిపై ఉండాల్సిందే. కానీ అలాంటి పరిస్థితులు మాత్రం నియోజకవర్గంలో కనపడటంలేదని తెరాస కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు, ఆయన సోదరుడు తిమ్మప్పలకు అంటూ ఓ వర్గం ఉంది. వీరు ప్రస్తుతం బహిరంగంగా మాట్లాడకున్నప్పటికిని ఆయన అనుచర వర్గం మాత్రం తమ నేత గట్టు బీముడుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్న కేసీఆర్ అది ఇవ్వలేదని తీరా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని ఆగ్రహంతో ఉన్నారు. గద్వాల తెరాస అభ్యర్థి కృష్ణమోహన్‌రెడ్డికి గట్టు వర్గీయులు ఏ మేరకు సహకరిస్తారోననే చర్చ కూడా జోరందుకుంది. అదేవిధంగా మరో నాయకుడు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి సైతం ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించారు. తీరా కేసీఆర్ టికెట్‌ను ఇవ్వకపోవడంతో ఆయన వర్గీయులు సైతం అలకబూనారు. విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు రంగంలోకి దిగి మధ్యవర్థిత్వం వహించిన్నట్లు సమాచారం. కేటీఆర్‌తో సైతం చర్చించిన్నట్లు తెలుస్తుంది. మంత్రుల ముందు మాత్రం కలిసి పని చేస్తామని హామీ ఇచ్చినప్పటికిని తీరా నియోజకవర్గంలో మాత్రం అలాంటి పరిస్థితులు కనపడటంలేదు. ఏది ఏమైనప్పటికిని ఈ నియోజకవర్గాల్లో తెరాస నేతల మధ్య సఖ్యతలేదని మాత్రం బహిరంగంగానే వినిపిస్తుంది.