మహబూబ్‌నగర్

ఎన్ని కూటములు వచ్చినా టీఆర్‌ఎస్ గెలుపును ఆపలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెబ్బేరు, సెప్టెంబర్ 21: వచ్చే ఎన్నికల్లో ఎన్ని కూటమిలు వచ్చినా టీఆర్‌ఎస్ పార్టీ గెలుపును అపలేరని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరు పురపాలక కేంద్రంలోని టిడిపి పార్టీకి చెందిన ఉదయ్‌కుమార్‌రెడ్డి స్వగృహాంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమానికి సింగిరెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు. టిడిపి జిల్లా కార్యవర్గ సభ్యులు, మాజీ గ్రంథాలయ చైర్మన్ విజయ్‌కుమార్‌రెడ్డితో పాట కాంగ్రెస్ నాయకులు జయసింహ్మరెడ్డి, జ్ఞానేశ్వర్‌రెడ్డి,రాజేశ్వర్‌రెడ్డితో పాటు వంద మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ది రంగంలో ముందుండాలంటే మళ్ళి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు. తెలంగాణ ద్రోహుల పార్టీగా టిడిపి, కాంగ్రెస్ పార్టీ కూటమి పేరుతో ఒకటవుతున్నారని ఎద్దేవా చేశారు. వనపర్తి నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డిని తాజామాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఎమ్మెల్యే పదవిని రావులచంధ్రశేఖర్‌రెడ్డికి ఇవ్వడానికైనా సిద్దమని ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఒంటె నాలుకకు నక్క ఎదురు చూసినట్లు రావుల ఎదురు చూశారని సీట్ల కోసమే వారి తపన ప్రజల అభివృద్ది పట్టదని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో ప్రజల చేతిల్లో ఓటమి పాలు అయినప్పటికి విరామం, విశ్రాంతి లేకుండా సాగునీరు, ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేసి ప్రజలో గుర్తిండి పోయ్యాయని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికలో వనపర్తి నియోజక వర్గం నుండి తనను భారీ మెజార్టితో గెలిపించాలని ఆ విధంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. మాజీ చైర్మన్ బుచ్చారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున్న నిరంజన్‌రెడ్డి సమక్షంలో చేరిన కార్యకర్తలను కండువాలు కప్పి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి కర్రెస్వామి, టీఆర్‌ఎస్ మండల పార్టీ అద్యక్షులు హరిశంకర్‌నాయుడు, ఎంపిటిసి గోవిందునాయుడు, ఐజక్, మద్దిలేటి, నాయకులు దిలిప్‌రెడ్డి, గోవిందు, భానుప్రకాష్‌రెడ్డి, సాయిరెడ్డి, ఎండి ముస్తాక్, సింగిల్‌విండో చైర్మన్ కోదండరాంరెడ్డి, వేణు, బాల్‌రాం, అక్కమ్మ,్భరతి తదితరులు పాల్గొన్నారు.