మహబూబ్‌నగర్

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గొడవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్లరూరల్, సెప్టెంబర్ 22: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శనివారం సబ్ రిజిస్ట్రార్‌కు అశోక్ కుమార్, బాలానగర్ తెరాస జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీశైలం యాదవ్‌ల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి ఇరువురి మధ్య అసభ్య పమదజాలంతో తీవ్ర దూషణలకు దారి తీసింది. అంతేకాక ఒకరిపై ఒకరు సబ్ రిజిస్టర్ టేబుల్‌పై ఉన్న ప్యాడ్‌లు, డాక్యుమెంట్లు విసురుకునే స్థాయికి చేరుకుంది. తన పేర, తన భార్య చంద్రజ్యోతి పేరిట,తన స్నేహితుడు ఎండి ఖలీల్‌ల పేరిట రాజాపూర్ మండలం గుండ్లపొట్లపల్లి గ్రామంలో గల 15.16 ఎకరాల భూమి విక్రయానికి సంబందించి ఈ గొడవ జరిగింది. ఆ భూమిని ప్రకాశ్‌రెడ్డి, ప్రకాశ్‌సింగ్‌లకు ప్రభాకర్‌రెడ్డి విక్రయించారు. అందుకు సంబందించి తమ పేరిట ఉన్న భూమిని కొనుగోలు దారుల పేరిట చేయడానికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చిన ప్రభాకర్‌రెడ్డి ఆ భూమికి సంబందించి ఓ గుంట టైటిల్ లీడ్‌లో లేకపోవడంతో సబ్ రిజిస్టర్ అశోక్‌కుమార్ రిజిస్ట్రేషన్ చేయడానికి అభ్యంతరం వ్యక్తం చేశారు.
టైటిల్ లీడ్‌లో పేరు లేకున్నా ఆన్‌లైన్‌లో నమోదు అయ్యిందని రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభాకర్‌రెడ్డి కోరారు. అందుకు సబ్ రిజిస్టర్ ససేమిరా అనడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈసందర్బంగా ప్రభాకర్‌రెడ్డితో పాటు అక్కడే ఉన్న మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీశైలంయాదవ్ కూడా సబ్ రిజిస్టర్‌తో గొడవ పడ్డారు. ఇరువర్గాల మధ్య మాటలు తారా స్థాయికి చేరడంతో అక్కడ ఉన్న కార్యాలయ సిబ్బంది, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ఇతరులు వారిని సముదాయించడానికి ప్రయత్నించారు. అయినా వారి వాగ్వివాదం అసభ్యకర పదజాలాలకు దారి తీయడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి నెలకొన్నాయి. ఈ గొడవ తారాస్థాయికి చేరడంతో కార్యాలయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. చిలికి చిలికి గాలివానగా మారిన గొడవ కార్యాలయ ప్రాంగణంలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ విషయం గురించి వెంటనే సామాజిక మాధ్యమాలలో ప్రసారం కావడంతో కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున వివిధ పార్టీల నాయకులు చేరుకున్నారు. గొడవ గురించి తెలుసుకున్న సిఐ బాల్‌రాజ్ యాదవ్ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఎర్పాటు చేశారు. అనంతరం ఇరువర్గాలు కూడా పోలీసులను ఆశ్రయించారు.

టీఆర్‌ఎస్ పాలనలోనే నడిగడ్డ అభివృద్ధి
* తెరాస పార్లమెంటరీ నాయకుడు జితేందర్‌రెడ్డి
గద్వాల, సెప్టెంబర్ 22: తెలంగాణ రాష్ట్రప్రభుత్వ నాలుగున్నర ఏళ్లలోనే నడిగడ్డ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని మహబూబ్‌నగర్ ఎంపీ, తెరాస పార్లమెంటరి నాయకుడు ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని తెరాస క్యాంప్ కార్యాలయంలో గద్వాల మండలం రేకులపల్లి, ధరూరు మండలం దోర్నాల గ్రామానికి చెందిన వంద మంది కార్యకర్తలు పార్టీలో చేరగా వారికి ఆయన కండువా కప్పి ఆహ్వానించారు. కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాలమూరు అన్ని రంగాల్లో వెనుకబడిందని, తెరాస అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్లలో సాగు, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పాలమూరు ప్రాజెక్టులపై కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుందని, గట్టు, తుమ్మిళ్ల ప్రాజెక్టులతో నడిగడ్డను సస్యశ్యామలం చేస్తామన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ జోగుళాంబ గద్వాల జిల్లా ఏర్పాటుకు ఎంపీ జితేందర్‌రెడ్డి చేసిన కృషి మరువలేనిదని, ఈ జిల్లా ప్రజలు ఆయనకు రుణపడి ఉన్నారన్నారు. తెరాస రాష్ట్ర కార్యదర్శి బండ్లకృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ తెరాస పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని, ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి గులాబీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. రేకులపల్లికి చెందిన వాకిటి శ్రీనివాస్, కావలి శ్రీనివాస్, మొగిలప్ప, కర్రెప్ప, దోర్నాలకు చెందిన బొజ్జన్న, రమేష్, జనార్ధన్, సురేష్, లక్ష్మణ్‌లతో పాటు వంద మంది కార్యకర్తలు పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుమల్‌రెడ్డి, విజయ్‌కుమార్, ఈశ్వరయ్య, ప్రతాప్‌గౌడు, వెంకటేశ్వర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, సీతారామిరెడ్డి, నజీర్ తదితరులు పాల్గొన్నారు.