మహబూబ్‌నగర్

ఈవీఎంలపై అపోహలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 22: ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించే ఈవీఏంలపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అనేక విధాలుగా రక్షణ చర్యలు తీసుకున్న తరువాతనే పోలింగ్ రోజున ఉపయోగించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇ.శ్రీ్ధర్ అన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశం హాల్‌లో ఈవీఎం, వీవీప్యాట్‌ల మొదటి దశ తనిఖీపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, టీడీపీ తదితర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్ మాట్లాడుతూ శాసనసభకు జరిగే మధ్యంతర ఎన్నికల నిర్వహణపై దశల వారిగా ఎన్నికల ప్రక్రియపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి వివరించడం జరుగుతుందని, ఇక్కడ తెలుసుకున్న విషయాలను మీ ద్వారా ప్రజలకు వివరించి వారిని చైతన్యపర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే ఈవీఎంలు జిల్లాకు వచ్చాయని, రాష్ట్రంలో తొలిసారిగా ఓటరు వేసిన ఓటు ఎవ్వరికి వేశామనేది తెలుసుకునేందుకు వీలుగా వీవీప్యాట్‌లను ఉపయోగించడం జరుగుతుందన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల పనితీరుపై ఆయన ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్‌ల తయారీ నుంచి పోలింగ్ కేంద్రం వరకు చేర్చేందుకు తీసుకునే చర్యలను ఆయన వివరిస్తూ దేశ రక్షణ కోసం రక్షణ శాఖ ఏవిధంగా జాగ్రత్తలు తీసుకుంటుంతో అదేవిధంగా భారత ఎన్నికల కమిషన్ కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ఈవీఎంల తనిఖీ, సీలింగ్, బ్యాలెట్ కేటాయింపు తదితర వాటిని గుర్తింపు పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే చేపడుతామన్నారు. ఈవీఏంలపై ఏఏ దశలో ఏవిధమైన చర్యలు తీసుకుంటారనే విషయాన్ని ఆయన విశదీకరించారు. టాంపరింగ్ చేయడానికి వీలులేదని, దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. ఓటరు వేసిన ఓటును అనుకున్న అభ్యర్థికి వేశాడా?లేదా? తెలుసుకునేందుకు వీవీప్యాట్ ఉపయోగపడుతుందని, ఓటు బటన్ నొక్కిన వెంటనే వీవీప్యాట్‌పై ఓటు వేసిన గుర్తు 7 సెకన్లపాటు కనిపిస్తుందని, ఆ తరువాత ఆ పేపర్ బాక్స్‌లో పడిన తరువాతనే ఈవీఎం మరో ఓటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల ప్రతినిధుల అనుమానాలను ఆయన నివృత్తి చేశారు. రానున్న శాసనసభ ఎన్నికలను జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని ఆయన కోరారు. 18ఏళ్లు నిండిన వారందరి పేర్లు ఓటరు జాబితాలో ఉండేందుకు వీలుగా ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకునేలా చూడాలని కోరారు. ఓటరు జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకునేలా చూడాలని, బూత్ లేవల్ నుంచి పార్టీ ప్రతినిధులు ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో మధుసూధన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.