మహబూబ్‌నగర్

గణపతి బొప్పా మోరియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కాషాయమయమైన పాలమూరు * క్లాక్‌టవర్ వేదిక దగ్గర గణణాథులకు వీడ్కోలు
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 22: తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథులు శనివారం నిమజ్జనానికి బయలుదేరారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లో ఏ వీధిలో చూసిన వినాయక విగ్రహాల ఊరేగింపు ఎంతో వైభవంగా భక్తిశ్రద్ధలతో కొనసాగింది. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి ఎప్పటికప్పుడు గణనాథుల ఊరేగింపుపై ఆరా తీశారు. ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేకంగా వినాయకుల ఊరేగింపు, మంటపాల దగ్గర జరుగుతున్న విషయాలను పరిశీలించడానికి ఓ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఇది ఇలా ఉండగా నిమజ్జనం ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉదయం వినాయకచవితి గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు అధ్యక్షుడు మద్దియాదిరెడ్డిలతో కలిసి విశ్వహిందూపరిషత్ నాయకులు అశోక్‌చౌరస్తాలో గల బాలాగంగాధర్ తిలక్ విగ్రహానికి పూజలు చేశారు. అక్కడే కాషాయధ్వజాన్ని ఎగురవేశారు. కాగా సాయంత్రం తర్వాత గణనాథుల ఊరేగింపు ప్రారంభం అయింది. నిమజ్జనానికి బయలుదేరుతున్న విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి క్లాక్‌టవర్ వేదికగా వీడ్కోలు పలికారు. బీచుపల్లి కృష్ణానదిలో మహబూబ్‌నగర్‌లోని గణనాథులను నిమజ్జనం చేశారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఊరేగింపులో పాల్గొన్నారు. యువకుల డ్యాన్స్‌లు, మహిళల కోలాటలు అబ్బురపరిచాయి. షాషాబ్‌గుట్ట, మర్లు, టీచర్స్‌కాలనీ సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో అక్కడ వందలాది మంది పోలీసుల బందోబస్తు మధ్య వినాయకుల విగ్రహాల ఊరేగింపు కొనసాగింది. ఈ సందర్భంగా క్లక్‌టవర్‌తో పాటు ప్రధాన చౌరస్తాలన్నీ కాషాయమయమయ్యాయి. పట్టణంలోని అన్ని ప్రాంతాల నుండి క్లాక్‌టవర్‌కు రావల్సిన గణనాథుల విగ్రహాల ఊరేగింపు రూట్‌మ్యాప్‌ను ఎస్పీ రెమా రాజేశ్వరి, డీఎస్పీ భాస్కర్‌ల రెండురోజుల ముందుగానే గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ప్రతిష్టించిన గణనాథుడి విగ్రహ ఊరేగింపు కన్నుల పండుగగా కొనసాగింది. మహిళలు ప్రత్యేకంగా ఈ ఊరేగింపులో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. క్లాక్‌టవర్ దగ్గర ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ కమిటీ వేదికపై మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, పి.చంద్రశేఖర్, మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్, డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్‌తో హజరై గణనాథులకు ప్రత్యేక పూజలు చేశారు.

ఓటరు నమోదును వేగవంతం చేయాలి
* కలెక్టర్ రోనాల్డ్‌రోస్
మక్తల్, సెప్టెంబర్ 22: ఓటరు నమోదు ప్రక్రియ మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో అధికారులు చరుకుగా వ్యవహరించి ఓటరు నమోదు ప్రకియను వేగవంతం చేయాలని, వచ్చిన ప్రతి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి అప్‌లోడ్ చేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అన్నారు. శనివారం ఆయన నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో 11 మండలాలకు చెందిన తహశీల్దార్లు, సంబంధిత బిఓఎల్, కంప్టూర్స్ ఆపరేటర్లతో జరుగుతున్న ఓటర్ల నమోదు ప్రక్రియ పరిశీలనను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం తహశీల్దార్ చాంబర్‌లో ఏర్పాటు చేసిన అన్ని మండలాల తహశీల్దార్లతో సమావేశపై వారి పనితీరుపట్ల సమీక్షించారు. అనంతరం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 32వేలకు సంబంధించిన ఓటర్ల ధరఖాస్తు పారాలు రాడవం జరిగిందని తెలిపారు. మార్పులు చేర్పులన్నింటికి ఈనెల 25వ తేదీ వరకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు వస్తున్న దరఖాస్తులను పరిష్కరించి మ్యాన్‌వల్, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వివరాలు అప్‌లోడు చేయాలని అన్నారు. ఓటరు జాబితాల్లో పేరు ఉండి వారు ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాలకు శాశ్వత వలసలు వెళ్లినవారు, రెండు సార్లు పేర్లు నమోదు అయిన వారు, చనిపోయిన వారి పేర్లను గుర్తించి వారికి నోటీసు ఇచ్చి తొలగించాలని తెలిపారు. ముఖ్యంగా మ్యాన్‌వల్ ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటిని ఈనెల 25వ తేదిలోపు అఫ్‌లోడ్ చేయాలని చెప్పారు.
కళాజాత, ర్యాలీల ద్వారా ప్రచారం..
ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పుల చేర్పుల విషయాలన్నింటిని ఆయా గ్రామాల్లో కళాజాత బృందాల ద్వారా, వాల్‌పోస్టర్ల ద్వారా, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా, ప్రతి రోజు అంగన్‌వాడి, ఆషావర్కర్లు, మహిళ సంఘాలు, విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, గ్రామాల్లో డప్పుద్వారా టాంటాం వేయించడం, బైక్ ర్యాలీల ద్వారా, టీవీ, సినిమా టాకీస్‌ల ద్వారా ప్రచారం కొనసాగిస్తున్నట్లు కలెక్టర్ రోనాల్డ్‌రోస్ చెప్పారు. సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవికుమార్, ట్రైనీ కలెక్టర్ మిలందుభాప్న, తహశీల్దార్లు రాజీవ్‌రెడ్డి, జ్ఞానేశ్వర్, వెంకట్‌నర్సింహయ్య , రామకోటి, పాండు నాయక్, ఎన్నికల డిటి సురేష్‌కుమార్ ఉన్నారు.