మహబూబ్‌నగర్

రైతు సంక్షేమమే టీఆర్‌ఎస్ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్‌గల్, సెప్టెంబర్ 23: ప్రజలు, రైతుల సంక్షేమమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని శాగాపూర్, కిష్టాపూర్ గ్రామాలలో పర్యటించి కార్యకర్తలతో మాట్లాడారు. అనంతరం మాదవరావుపల్లి, కిష్టాపూర్ వద్ద డి - 8 కాల్వలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రైతాంగానికి సాగునీటి కష్టాలను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని, రైతాంగానికి చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందిస్తామన్నారు. టీఆర్‌ఎస్ పార్టీని మరోసారి గెలిపించి అభివృద్ధి మరింత ముందుకు సాగడానికి తోడ్పాటు అందించాలని, ప్రతిపక్ష పార్టీల మోసపూరిత మాటలు ప్రజలు నమ్మవద్దని ఆయన అన్నారు. మిషన్ భగిరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లానీటిని త్వరలోనే అందించడం జరుగుతుందన్నారు. డి - 8 కాల్వ పనులను త్వరగా పూర్తి చేసి సాగునీటిని అందించడం జరుగుతుందన్నారు. టీఆర్‌ఎస్ పథకాలు, చేపట్టిన అభివృద్ధిపై గ్రామాలలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. శాగాపూర్‌లో రైతులు విత్తనాలు పొలంలో చల్లుతుండగా అక్కడికి వెళ్లి విత్తన గడెంతో పొలాన్ని దున్నాడు. మంత్రి వెంట ఎంపీపీ వెంకటేష్‌నాయుడు, జడ్పీటీసీ రవి, విండో వైస్ చైర్మన్ భాస్కర్‌యాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా డైరెక్టర్ బాలరాజు, నాయకులు గోవర్దన్‌సాగర్, తిరుపతయ్య, గోపాల్, వీరసాగర్, చంద్రునాయక్, జయరాములు, బ్రహ్మం, బాలరాజు, తిరుపతయ్య యాదవ్ పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న అధికార పార్టీ నేతలు
* ప్రారంభోత్సవాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
* మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి
వనపర్తి, సెప్టెంబర్ 23: అపద్దర్మ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జి. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం వనపర్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాన్ని రద్దు చేసిన తరువాత అపద్దర్మ ప్రభుత్వం కొత్త పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయరాదని , ఒక వేళ చేయావలసి వస్తే సంబందిత అధికారులు చేయవలసి ఉంటుందని ఆయన అన్నారు. ప్రభుత్వం రద్దు అయిన తరువాత వనపర్తి నియోజక వర్గంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాద్యక్షులు నిరంజన్‌రెడ్డి అనేక పనులకు ప్రారంభోత్సవాలు చేశారని, 24వ తేదిన ఆపద్దర్మ ముఖ్యమంత్రి మహిమూద్ అలీచే ప్రారంభోత్సవాలు చేయించడానికి సిద్దమయ్యారని ఆయన అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లపై ప్రబావం పడుతునందున ఎన్నికల అధికారులు వెంటనే ఈ కార్యక్రమాలను నిలిపి వేయాలని, అదే క్రమంలో అభివృద్దిని అపకుండా అధికారులు పనులను ప్రారంభించాలని చెప్పారు. ఇటివలే ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ట్రాన్స్‌కో అధికారి ప్రభాకర్‌రావులు పనులను ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు.
ఓటు హక్కును నమోదు చేసుకోవాలి
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఎంతో ప్రాదాన్యత ఉన్నదని, 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకొవాలని మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో ఎన్నికల సంఘం ఆగమేఘాల మీద ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టిందని దాంతో రెండు రోజులే సమయంఉన్నందున అర్హులైన వారందరు ఓటర్ నమోదు చేసుకోవాలని కోరారు. ఓటర్లకు సమయం ఇవ్వకుండా నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల అనుకున్న స్థాయిలో ఓటర్ల నమోదు కాలేదని ఈ విషయంపై సుప్రింకోర్టుకు వెళ్ళామని ఆయన తెలిపారు. వనపర్తి పట్టణంలో, నాగవరం గ్రామంలో ఓటర్ల నమోదు తక్కువగా ఉందని నియోజక వర్గంలోని అర్హులైన వారంతా ఓటర్‌గా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శంకర్‌ప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, తిరుపతయ్య, కిరణ్‌కుమార్, రాగివేణు, కమర్‌మీయా, అక్తర్, సతీష్‌కుమార్, బ్రహ్మం, బాబా, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.