మహబూబ్‌నగర్

ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, మాగనూర్, సెప్టెంబర్ 23: మక్లల్ నియోజవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని మక్తల్ తెరాస అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ముష్టిపల్లి గ్రామానికి చెందిన యువకులు, టీడీపీ నాయకులు బెల్లం శ్రీను నాయకత్వంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అంతకుముందు క్రిష్ట మండలం కుసుమూర్తి రాఘవేంద్రస్వామి దేవాయలంలో ప్రత్యేక పూజలు చేసిన రాంమోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ముష్టిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికై అహర్నిషలు కృషి చేస్తున్న కార్యకర్తల కృషిని మరువనని అన్నారు. పార్టీ మనుగడ కోసం పనిచేసే వారందరు ఎల్లప్పుడు గుర్తించబడుతారని చెప్పారు. బంగారు తెలంగాణ ఏర్పాటులో భాగంగానే తమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం జరిగిందని చెప్పారు. వీటిని ప్రతిపక్షాలు ఎంతో రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. కాగా గుర్జాల్ గ్రామం నుండి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా పార్టీ కార్యకర్తలతో కలసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్నికల ప్రచారం కృష్ణా మండలంలో సంగమం ప్రాంతం, క్షీరలింగేశ్వర స్వామి ఆలయం పూజలు నిర్వహించిన వారికి రాజకీయంలో కలసి రావడం జరుగుతుందని నాయకుల సెంటిమెంటుగా భావిస్తుండటంతోటే నేడు చిట్టెం రాంమోహన్‌రెడ్డి సైతం గుర్జాల్ నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి చూసే ఇతర పార్టీల నుండి వలసన పర్వం కొనాసాగుతుందని ఆయన అన్నారు. తమ నాయకుడు చేపట్టిన అభివృద్ధి పథకాలే తమని గెలిపిస్తాయన్న నమ్మకం తమకు మెండుగా ఉందని అన్నారు. తమ పథకాల ప్రభావాన్ని చూసి ఓర్వలేకే ప్రతి పక్ష పార్టీల నాయకులు గగ్గోలు పెడుతున్నారని అన్నారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కిలు చేసినా, ఆడినా తన గెలుపును మాత్రం ఎవరు ఆపలేరని చిట్టెం రాంమోహన్‌రెడ్డి పూర్తి స్థాయి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నర్సింహగౌడ్, ఎంపిటిసి రవిశంకర్‌రెడ్డి నాయకులు మహిపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి, నర్సింహరెడ్డి, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఓటు హక్కు చాలా విలువైంది
వనపర్తి, సెప్టెంబర్ 23: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు చాలా విలువ ఉందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి శే్వతామహంతి అన్నారు. ఓటర్ నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించడంలో భాగంగా ఆదివారం వనపర్తిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కును వినియోగించడం ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకోవచ్చని ఆమె అన్నారు. అందు వల్ల జనవరి 1. 2018 నాటికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటర్‌గా నమోదు చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. కొత్తగా ఓటర్ నమోదు చేసుకునేందుకు ఈనెల 25 వరకు అవకాశం ఉంటుందని, ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వీనియోగం చేసుకోవాలని ఆమె చెప్పారు. కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవసరమైన ఫాం 6 సంబందిత బి ఎల్‌వో దగ్గర సిద్దంగా ఉంటుందని, లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొవచ్చని ఆమె తెలిపారు. ముఖ్యంగా యువత ఓటు హక్కులు పాల్గోనాలని ఆమె పిలుపునిచ్చారు. శిక్షణ కలెక్టర్ సంతోష్, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవో చంద్రారెడ్డి, డిఆర్‌డివో గణేష్, డిపిఆర్వో వెంకటేశ్వర్లు, జిల్లా క్రీడల అభివృద్ది అధికారి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. జూనియర్ కళాశాల నుండి ప్రారంభమైన ర్యాలీ గాంధి చౌక్‌మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి, ఇందిర పార్కు, వివేకానంద చౌరస్తా, పాలిటెక్నిక్ కళాశాల, రాజీవ్ చౌక్‌మీదుగా తిరిగి జూనియర్ కళాశాలకు చెరుకుంది. ర్యాలీలో సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు.