మహబూబ్‌నగర్

కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకద్ర, సెప్టెంబర్ 24: రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఅర్ పని చేస్తున్నారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం దేవరకద్ర మండలంలోని రాజోలి నుంచి ముందు గ్రామాలకు రూ.33కోట్లతో సాగునీరు అందించేందుకు గ్రానైట్ ద్వారా కాల్వల పనులకు భూమిపూజ చేసి, రాజోలి నుంచి కౌకుంట్ల వరకు బీటి రోడ్డు పనులు పూర్తి చేయడంతో పనులను ప్రారంభించారు. కౌకుంట్ల పాఠశాలలో అదనపుగదులను, గోపన్‌పల్లిలో 11కేవి విద్యుత్‌సబ్‌స్టేషన్‌ను ప్రారంబించారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కుడి వైపు నుంచి కాలువల ద్వారా సాగునీరు అందించేందుకు రూ.33కోట్ల నిదులు మంజూరు కావడంతో పనులు ప్రారంబించేందుకు భూమిపూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఅర్ నిరంతరం రైతులను ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారని వారన్నారు. అందులో బాగంగానే మారుమూల గ్రామాలు, తాండలు అబివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఅర్ పని చేస్తూ ముందుకు సాగుతున్నారని వారు తెలిపారు. కొత్తగా ఎర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఏళ్లలోనే 70ఏళ్లలో చేయని అబివృద్ది చేయడం జరిగిందని వారు అన్నారు. అబివృద్దిని చూసీ ఇతర పార్టీల వారు టీఅర్‌ఎస్ పార్టీలలో కలుస్తుంటే దినిని చూసి జీర్ణించుకోలేని కాంగ్రేస్, టీడీపీ, పార్టీల వారు టీఅర్‌ఎస్ పార్టీలో చేరుతుంటే వారికి మాత్రం సోయి రావండం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి ఓక్కరు కులమతలకు అతీతంగా కనివిని ఎరుగని విదంగా అబివృద్ది చెందాలనే ఉద్దేశంతోనే ప్రతి చిన్నగ్రామంను, తాండలను గ్రామపంచాయతిలుగా ఎర్పాటు చేశారన్నారు. అందులో బాగంగానే రైతుబీమా పథకం ప్రపంచంలోనే చరిత్రాత్మకంగా నిలుస్తుందన్నారు. అన్ని వర్గాల అబివృద్ది సంక్షేమం కోసం పని చేస్తూనే రైతులు బాగుంటేనే రాష్ట్రం సుభీక్షంగా ఉంటుందని బావించి రైతులసంక్షేమం కోసం అనేక సంక్షేమపథకాలు అమలు చేశారన్నారు. రైతుబీమ, వ్యవసాయానికీ నిరంతర విద్యుత్, పంటపెట్టుబడికి ఎకరానికి ఎడాదికి 8వేలు, కల్యాణలక్ష్మిపథకం, మిషన్‌భగీరధ ద్వార ఇంటీంటికీ త్రాగు నీరు అందించడం, బీసీలకు, మైనార్టీలకు గురుకులాలు ఎర్పాటు చేసీ కారోరేట్ స్థాయిలో విద్యను అందించుతున్నారని తెలిపారు. ఇలాంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి రాష్టన్న్రి అగ్రస్థానంలో నిలబెట్టిన అపారభగీరథుడు సీఏం కేసీఅర్‌కే దక్కుతుందన్నారు. దేవరకద్ర నియోజకవర్గం అబివృద్ది చెందిందంటే సీఎం కేసీఅర్‌తో ఎమ్మెల్యే అలవెంకటేశ్వర్‌రెడ్డి చనువు ద్వారా ఇన్ని పనులు చేసుకోవడం జరిగిందన్నారు. ఇంకింత అబివృద్ది కావాలంటే అల వెంకటేశ్వర్‌రెడ్డిని అత్యదిక మేజార్టితో గెలిపించాలన్నారు. పుణ్యమే అని అన్నారు. గత 70ఏడ్లుగా ఏ ప్రభుత్వం చేయని అబివృద్ది పనులు టీఅర్‌ఎస్ ప్రభుత్వంలోనే చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఈకార్యక్రమంలో మాజి ఎమ్మెల్యే అలవెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ ఇవి గోపాల్, మార్కెట్ కమిటి చైర్మెన్ దొబ్బలి అంజనేయులు, లారీల అశోషేషన్ గౌరవ అధ్యక్షులు జెట్టినరసింహ్మరెడ్డి, మండపార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్‌యాదవ్, మండలనాయకులు, కర్ణంరాజు, వెంకటేష్, బాలస్వామి, బాస్కర్, స్వామి, అజ్జు, గోపాల్, పకిరన్న, కొండ శ్రీనివాస్‌రెడ్డి, మండల రైతు సంఘం అధ్యక్షుడు కొండరెడ్డి, కృష్ణయ్య, తదితరులున్నారు.