మహబూబ్‌నగర్

అభివృద్ధే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయిలకొండ, సెప్టెంబర్ 25: నాలుగేళ్లలో రాష్ట్రంలో ఊహించని అభివృద్ధి చేయడం జరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజలను, బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని , తమ ఉనికి కొల్పోతామని ప్రతిపక్షాలు అభివృద్ది అడుకోవడం ప్రాజెక్టులపై వందల సంఖ్యలో కేసులు వేయడం జరుగుతోందని టీఆర్‌ఎస్ మహబూబ్‌నర్ పార్లమెంట్ ఇన్‌చార్జ్, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాశ్ అన్నారు. మంగళవారం కోయిలకొండ మండల కేంద్రంలోని ఆదిఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో మండలంలోని వివిధ బిసి సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీని మండల నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బండ ప్రకాశ్ మాట్లాడుతూ వలసలతో అల్లాడిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి పాలమూరు రంగారెడ్డి పథకం తీసుకొని రావడం జరిగిందన్నారు. జిల్లా కాంగ్రేస్ నాయకులు కళ్లు మండి జిల్లా అభివృద్ధిని అడ్డుకోడానికి కేసులు వేశారన్నారు. నారాయణపేట నియోజకవర్గంలో రాబోయో ఎన్నికల్లో రాజేందర్‌రెడ్డి భారీ మెజారితో గెలుపోందడం ఖాయమన్నారు. సమావేశంలో ఎంపిపి స్వప్న, సింగల్‌విండో చెర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు కృష్ణయ్య, మల్లయ్య,వెంకట్రాములు, మాధవులు, వెంకటేశ్, వివిధగ్రామాల నాయకులు పాల్గొన్నారు.
అసమ్మతి నేతలకు బుజ్జగింపులు
* ప్రచారంలో దూసుకుపోతున్న చిట్టెం
ఆత్మకూర్, సెప్టెంబర్ 25: ముందస్తు ఎన్నికల్లో భాగంగా మక్తల్ అసెంబ్లీ నియోజక వర్గం నుండి అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన నాటి నుండి అసమ్మతి నేతలు బహిరంగ సభలు నిర్వహిస్తూ అధినాయకత్వంపై తిరుగుబాటు ఎగురవేయడంతో నియోజక వర్గంలో గందోర గోళ పరిస్థితి నెలకొన్నాయి. అసమ్మతి నేతలు జలెందర్‌రెడ్డి, గాజుల ఆశిరెడ్డి , గోపాల్‌రెడ్డి, లక్ష్మికాంత్‌రెడ్డి తదితరులు టీ ఆర్ ఎస్ ముద్దు చిట్టెం వద్దు అనే నినాదంతో బహిరంగ సభలు నిర్వహిస్తూ అసమ్మతి నేతల్లో టిక్కెటు ఎవరికి ఇచ్చినా గెలింపించేందుకు సిద్దంగా ఉన్నమంటూ పార్టీ అధిష్టానానికి సవాళ్ళు విసురుతుండడంతో ఎట్టకేలకు సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటి ఆర్ అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యులు జితేందర్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఓ కొలిక్కి రావడంతో కొంత మంది అసమ్మతి నేతలను నోరుమెదపనియ్యకుండా చేశారు. నియోజక వర్గ స్థాయిలో కొంత క్యాడర్ కల్గినటువంటి జలెందర్‌రెడ్డి మాత్రం చిట్టెం నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్పించబోమని ఎంపికి స్ఫష్టం చేసినట్లుగా తెలిసింది. సోమవారం జరిగిన చర్చల్లో కేటి ఆర్ చేసిన సూచనలను పాటిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అసమ్మతి నేతలు చెప్పినట్లుగా తెలిసింది. ఇదిలా ఉండగా అభ్యర్థిత్వం ఖరారు అయినప్పటికి నుండి మక్తల్ నియోజక వర్గంలో సుడిగాలి పర్యటనలు కొనసాగిస్తూ తాజామాజి ఎమ్మెల్యే చిట్టెం ప్రచారంలో దోసుకుపోతున్నారు. మహకూటమి అభ్యర్థి తెలకపోవడంతో ఎవరికి వారు యమున తీరే అనే చందంగా కూటమికి చెందిన నాయకులు టిక్కెటు తమనే వరిస్తుందని కాంగ్రెస్, టిడిపిలకు చెందిన నాయకులు ఇప్పటికి ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉన్నారు. ఏది ఏమైనప్పటికి మక్తల్ నియోజక వర్గం నుండి మహకూటమి అభ్యర్థిత్వం ఖరారు అయితేనే గ్రామాలలో ఎన్నికల వేడి రాజుకుంటుందని ఆయా పార్టీలకు చెందిన నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నియోజక వర్గ స్థాయిలో అసమ్మతి కొనసాగుతున్నప్పటికి అధికార పార్టీ అభ్యర్థి రామ్మోహన్‌రెడ్డి మాత్రం ఇతర పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వనిస్తూ ప్రచార జోరు పెంచుతున్నారు.