మహబూబ్‌నగర్

ఆరోగ్య మంత్రి ఇలాకాలో అనారోగ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, సెప్టెంబర్ 25: వైద్య ఆరోగ్య శాఖకు మంత్రిగా ఉన్న లక్ష్మారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో పారిశుద్ధ్య పరిస్థితులు దారుణంగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లురవి ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి ఇలాఖాలోనే పరిస్థితులు ఈ విధంగా ఉంటే ఇక రాష్ట్రంలో ఎలాఉన్నాయోనని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం జడ్చర్ల పట్టణంలో డెంగ్యూ ప్రభావిత ప్రాంతమైన పద్మావతి కాలనీలో మల్లురవి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని మురికి కాల్వల్లో చెత్త,చెదారం పేరుకుపోయి ఉండటం, వాటిలో పందులు స్వైర విహారం చేస్తూ ఉండటం చూసిన ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పరిస్థితులు ఇలా ఉంటే రోగాలు ప్రభలవా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలువురు డెంగ్యూ వ్యాధి భాధితులను పరామర్శించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ సునీతను కలిసి పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగు పరిచి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని వినతిపత్రం సమర్పించారు. పట్టణంలో ఎంత మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు, వారిపై పర్యావేక్షణాధికారులు ఎంత మంది ఉన్నారు, ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎంతమంది ఉన్నారని మల్లురవి ఆరా తీశారు. మున్సిపాలిటిలో శానిటరీ ఇన్స్‌పెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉందని, ఆరోగ్య పరిరక్షణ అధికారులు కూడా ఎవరూ లేరని మున్సిపల్ కమిషనర్ సునీత తెలపడంతో ఆరోగ్య మంత్రి సొంత నియోజకవర్గకేంద్రంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. మంత్రి వైఫల్యం కారణంగానే పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయని మల్లురవి ఆరోపించారు. తన స్వంత నియోజకవర్గంలో గల నగర పంచాయతీలో పారిశుధ్ధ్య సిబ్బంది నియామకం విషయంలో మంత్రి చొరవ చూపకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. పట్టణంలో డెంగ్యూ వ్యాధి ప్రబలి సుమారు పదిమంది తీవ్ర అస్వస్థతకు గురైనా ఎలాంటి పారిశుద్ధ్య చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. వారంలో పారిశుధ్ధ్య పనులు పూర్తి చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కమిషనర్ సునీతను హెచ్చరించారు. ఈ సందర్భంగా మల్లురవి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీదేవి, రీజినల్ డైరక్టర్ శశాంక్ డిఎంఅండ్‌హెచ్‌ఒ రజనీ, బాదేపల్లి కమ్యూనిటి హెల్త్ సెంటర్ సూపరిండెంట్ భాస్కర్ నాయక్‌లతో ఫోన్‌లో చర్చించారు. పట్టణంలో వ్యాధి ప్రబలకుండా పారిశుధ్ధ్య పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, అందుకు అవసరమైన అధికారులు,సిబ్బందిని తాత్కలికంగానైనా నియమించి ఈ వర్షాకాల సీజన్‌లో ప్రజలను గట్టెక్కించాలని, ముమ్మరంగా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వారికి అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమాలల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యానందం, అశోక్, పర్మటయ్య, మినాజ్, రేణుక,లత మహిపాల్‌రెడ్డి, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.