మహబూబ్‌నగర్

ముందస్తు ఎన్నికల వేళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, సెప్టెంబర్ 25: గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ముందస్తు ఎన్నికల వేళ రాజకీయ రగడలు పలుచోట్ల ఘర్షణకు దారి తీస్తున్నాయి. తాజాగా గద్వాల మండలం పూడూరు గ్రామంలో కాంగ్రెస్, తెరాస కార్యకర్తల మధ్య జరిగిన దాడిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుమ్మరి కృష్ణ మృతి చెందాడు. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యుల, కాంగ్రెస్ పార్టీ నాయకుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పూడూరు గ్రామానికి చెందిన కుమ్మరి కృష్ణ ధరూరు మండల కేంద్రం నుంచి ఇల్లరికం వచ్చి జీవిస్తున్నాడు. గత ఆదివారం గ్రామంలో జరిగిన వినాయక నిమజ్జనం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వినాయకుడి ఊరేగింపు సందర్భంగా డీజే సౌండ్ సిస్టం ఏర్పాటుపై తెరాస కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. ఈ ఘర్షణలో కాంగ్రెస్‌కి చెందిన ఐదుగురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయాలపాలైన కుమ్మరికృష్ణ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో ఒక్కసారిగా పూడూరులో వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్, తెరాసకార్యకర్తల మధ్య గొడవలు జరుగవచ్చన్న ముందస్తు సూచనల మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం గట్టిబందోబస్తు ఏర్పాటు చేసింది. కర్నూల్ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం తరలించే ప్రక్రియలో తెరాస నాయకులు కుటుంబ సభ్యులతో రాజీ యత్నాలు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామం నుంచి గద్వాలలో కాంగ్రెస్ శవయాత్ర చేసేందుకు పూనుకోగా పోలీసులు వారించారు. దీంతో ఎమ్మెల్యే డీకే అరుణ పూడూరుకు చేరుకొని మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెరాస నాయకులు హత్యారాజకీయాలతో అధికారం చేపట్టాలని చూడడం పనికిమాలిన చర్యగా అభివర్ణించారు. ప్రజల ప్రేమాభిమానాలతో ఓట్లు వేయించుకోవాలని, భయబ్రాంతులు చేసి ఓట్లు దండుకోవాలని చూస్తే ఓటమి తప్పదని, గతంలో రెండు సార్లు అనుభవం జరిగినప్పటికి మార్పు రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఖబర్దార్ తెరాస గుండాల్లారా అంటూ హెచ్చరించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమైనా జరిగితే తెరాస నాయకులకు అంతుకుమించి అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. కుమ్మరి కృష్ణ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఖననం ఖర్చులకు రూ.10వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా కుమ్మరి సంఘం నాయకులు తెరాస నాయకుల హత్యా రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తప్పులులేని ఓటరు జాబితా తయారీకి సహకరించాలి

* అఖిలపక్ష సమావేశంలో అనితా రాజేంద్ర సూచన
నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 25: ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛమైన ఓటరు జాబితాను రూపొందించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటరు జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే తెలియచేయాలని ఓటరు జాబితా జిల్లా పరిశీలకురాలు అనితా రాజేంద్ర సూచించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశం హాల్‌లో ఓటరు సవరణ కార్యక్రమంపై గుర్తింపు గల రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 10న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించడం జరిగిందని, దాని ఆధారంగా సవరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సవరణలు, అభ్యంతరాలను పరిష్కరించబడిన తరువాత తుది జాబితాను రూపొందించడం జరుగుతుందని, అట్టి ప్రతులను రాజకీయ పక్షాలకు అందచేస్తామన్నారు. ఓటరు జాబితాతోపాటు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో అన్ని పక్షాలు జిల్లా ఎన్నికల అధికారికి సహకారం అందించాలన్నారు. అన్నీ రాజకీయ పార్టీలు కూడా బూత్‌స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. వివిధ పార్టీలనాయకులు మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ కార్యక్రమం చివరి తేదీని పొడిగించాలని, నాగర్‌కర్నూల్‌లో గతంలో 32 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం 22 చేయడం వల్ల కొంతమంది ఓటర్ల జాబితాలో పేర్లులేవని, వీటన్నీంటిని సరిచేసేందుకు సమయం కావాలని కోరారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకునేవారి నుంచి నిర్వాహకులు వంద రూపాయలు తీసుకుంటున్నారని పరిశీలకుల దృష్టికి తీసుకొచ్చారు. ఆయా పార్టీల ప్రతినిధులు ఇచ్చిన సూచనలు, సలహాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొని పోతానని అనితా రాజేంద్ర తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ్ధర్ మాట్లాడుతూ ఓటరు సవరణ కార్యక్రమం నిర్వహణపై సభ్యులకు వివరించారు. బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన తరువాతనే డుప్లికేట్, చనిపోయిన వారి ఓట్లను తొలగిస్తున్నామన్నారు. ఓటరు నమోదు విధానం గురించి ఆయన వివరించారు. ఫాం ఆరును నింపి బీఎల్‌వోలకు ఇవ్వాలన్నారు. గతంతో పోలిస్తే ఈసారి జిల్లాలో 8శాతం ఓటర్లు పెరిగారని వెల్లడించారు. ఈ సమావేశంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డితోపాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.