మహబూబ్‌నగర్

రస్కందమాతగా జోగుళాంబ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవపాడు, అక్టోబర్ 14: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ రోజు ఆదివారం జోగుళాంబ అమ్మవారు స్కందమాతదేవిగా దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు, ఆలయ ఈవో గురురాజ సమక్షంలో నిత్యపూజల్లో భాగంగా యాగశాలలో హోమాలు, బలిహరణ, కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారికి నివేదన సమర్పించారు. విరామం తర్వాత సాయంత్రం వరకు సహస్తన్రామార్చనలు నిర్వహిస్తూ భక్తులకు సర్వదర్శన సదుపాయం కల్పించారు. 6గంటల తరువాత అమ్మవారికి మహామంగళహారతి ఇచ్చారు. రాత్రి 7గంటలకు జోగుళాంబదేవి స్కందమాతదేవి భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఉదయం నుంచే శ్రీజోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు భక్తుల తాకిడి అధికమైంది. అలంపూర్ క్షేత్రం విద్యుత్తు కాంతులతో విరాజిల్లింది.
కార్యక్రమంలో ఆలయ కమిటి చైర్మన్ తిరుపతిరెడ్డి, అర్చకులు శ్రీకాంత్‌శర్మ, విక్రాంత్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
కోస్గిలో..
కోస్గి: గత ఐదు రోజులుగా వివిధ రూపాలతో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గాదేవి ఐదవ రోజు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఆదివారం స్థానిక లక్ష్మీ వెంకటేశ్వర శివసాయి అయ్యప్ప దేవాలయంలో సరస్వతి దేవిగా దర్శనమివ్వవడంతో పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. చదువులతల్లి కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు పోటీ పడ్డారు.
పని చేసే పార్టీకి పట్టం కట్టండి
* ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలు నమ్మకండి * కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టండి * రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి

జడ్చర్ల, అక్టోబర్ 14: రాబోయే ఎన్నికల్లో ప్రజలు పనిచేసే టీఆర్‌ఎస్ పార్టీకే పట్టం కట్టాలని మంత్రి లక్ష్మారెడ్డి ప్రజలను కోరారు. ఆదివారం మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్ల మండలంలోని ఆలూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని యాసాయికుంట తాండలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాండకు చెందిన పలువురు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల నాయకులు కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను తికమక చేసే యత్నం చేస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని అన్నారు. గత 70 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్, టీడీపీ పార్టీలేనని ఆయా పార్టీల హాయాంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సరాల కాలంలోనే అనేక అబివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించి దేశంలోనే అగ్రగామీగా నిలపడం జరగిందని అన్నారు. అందువల్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మకుండ వారిని గ్రామాల నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మంత్రి లక్ష్మారెడ్డికి తాండ మహిళలు బతుకమ్మతో ఘన స్వాగతం పలికారు.