మహబూబ్‌నగర్

గత హామీలకే అతీగతీలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, అక్టోబర్ 14: నిధులు, నియామకాలు, ఆత్మగౌరవంపేరిట ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో ఏ ఒక్కవర్గం కూడ సంతోషంగా లేదని, గత హామీలకు అతీగతీ లేకుండా పోగా కొత్త హామీలతో ఎన్నికలకు వచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని గద్వాల తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ మండిపడ్డారు. ఆదివారం నియోజకవర్గంలోని ఇందువాసి, మిట్టదొడ్డి, నర్సన్‌దొడ్డి, అనంతపురం, జమ్మిచేడు గ్రామాలకు చెందిన తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు దాదాపు 500 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తెరాస పార్టీ పతనం కాబోతుందని, అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులేతప్పా సాగునీటి కోసం కేసీఆర్ ప్రభుత్వం చేసింది శూన్యమన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, డబుల్‌బెడ్‌రూం ఇండ్లు ఎక్కడ కూడ కట్టివ్వలేదని, రైతులకు గిట్టుబాటు ధర అందలేదని, తెరాస ప్రభుత్వంలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడని, రైతులు, సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికి వాటిని పట్టించుకోకుండా దుబార ఖర్చులతో ఇష్టారాజ్యంగా తమకు అనుకూలమైన పనులు చేసుకుంటూ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. ముందస్తు ఎన్నికలు ఓ పెద్ద డ్రామాగా ఆమె అభివర్ణిస్తూ పేదప్రజలను మభ్యపెట్టి మరోసారి ఎన్నికల్లో లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తోందని, ప్రజలు అప్రమత్తమై తెరాస నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, వరి, మొక్కజొన్నలకు మద్దతు ధర రూ.2వేలు, పత్తికి రూ.6వేలు, మిర్చికి రూ.10వేలు, పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుందన్నారు. 10లక్షల మంది నిరుద్యోగులకు రూ.3వేల నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు, లక్ష ఉద్యోగాల కల్పన, మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్, వికలాంగులకు రూ.3వేలు, వృద్దులకు రూ.2వేల పించన్, ఇందిరమ్మ ఇంటికి అదనంగా రూ.2లక్షలు, ఇళ్లు లేనివారికి రూ.5లక్షల గృహ నిర్మాణం, ఏడు కిలోల సన్నబియ్యం, ఉచిత భీమా, కౌలురైతులకు రైతు సహాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, నాగేంధర్‌రెడ్డి, శివారెడ్డి, మధుసధూన్‌రావు, నర్సన్‌దొడ్డి కృష్ణారెడ్డి, హన్మంతరాయ, జాన్‌మక్బుల్, లక్ష్మీరెడ్డి, సమీర్ తదితరులు ఉన్నారు.