మహబూబ్‌నగర్

సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, అక్టోబర్ 14: అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ ఇప్పటికే అన్ని ప్రణాళికలు రూపోందించిందని సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించడం జరుగుతుంని జిల్లా ఎస్పీ అపూర్వారావు హెచ్చరించారు. ఆదివారం వనపర్తిలో ఆమె మాట్లాడుతూ జిల్లా సరిహద్దులో విస్తృతంగా తనిఖిలు చేపడుతున్నామని, డబ్బు, మద్యం, ఓటర్లను ప్రబావితం చేసే ఇతర ఏ వస్తువులైనా పెద్ద మొత్తంలో ఇతర రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి సరఫరా చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆమె సూచించారు. నేర ప్రవృత్తి కల్గిన వారు ఇతర వ్యక్తులపై అప్రమతంగా ఉండి గట్టి నీఘా ఏర్పాటు చేయాలని ఆమె పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీ సృజన, పోలీస్ సిబ్బంది స్టాటిక్ సర్వే లెన్స్ టీమ్స్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వనపర్తి పట్టణం, వనపర్తి రూరల్, పెద్దమందడి, గోపాల్‌పేట, రేవల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఉన్న అన్ని చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖిలు చేపట్టారు.