మహబూబ్‌నగర్

పోలింగ్ ప్రక్రియపై వెబ్‌కాస్టింగ్ ప్రణాళిక సిద్ధం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 12: రాబోయే ఎన్నికల్లో జిల్లాలో పోలీంగ్ ప్రక్రియకు వెబ్‌కాస్టింగ్ ప్రణాళికలు సిద్దం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రావ్ అన్నారు. సోమవారం కలెక్టర్ చాంబర్‌లోని పాలమూరు యూనివర్సిటీ,జెపిఎన్‌సిఇ వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1312 పోలీంగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేయూటకు వివిధ కళాశాలల నుండి విద్యార్థుల వివరాలను సేకరించాలని ల్యాబ్‌ట్యాప్ ఉన్న ప్రతి విద్యార్థి దరఖాస్తు చేసుకోవాలని పోలీంగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేయడం ద్వారా ఎన్నికల అధికారికి కేంద్రంలో సి ఇ ఓకు తెలుస్తుందని ఏ పోలీంగ్ కేంద్రంలో సమస్యాత్మకంగా ఉండి పోలీంగ్ ప్రక్రియకు సంబంధించిన యువతకు అవగాహన కల్పించాలన్న ఆలోచనతో యువతను బాగస్వాములు చేయాలనే ఉద్దేశ్యంతో తీసుకోవడం జరిగిందన్నారు. డిసెంబర్ 1వ తేది నుండి 8వ తేది వరకు ఏ షెడ్యూల్డ్ లేకుండా విద్యార్థుల అందుబాటులో ఉండేవిధంగా చూడాలని అన్నారు. అన్ని కళాశాలలకు సర్క్యూలర్ పంపి ల్యాబ్‌ట్యాప్ ఉన్న ప్రతి విద్యార్థి ఇందులో పాల్గొనేలా చూడాలని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 570 దరఖాస్తులు వచ్చాయని అందులో 182మంది రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. ఇప్పటివరకు 388యాక్షన్‌లో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ గిరిజ, ఇన్‌చార్జి రిజిస్టర్, సూపరింటెండెంట్ రవీందర్, జెపిఎన్‌సిఇ కళాశాల రఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.